'రాజరథం' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న నిరూప్‌

Saturday,November 04,2017 - 09:45 by Z_CLU

నిరూప్‌ భండారి, ‘రంగితరంగ’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీలో నటించిన హ్యాండ్సమ్‌ హీరో. ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం పంపిన 305 చిత్రాల్లో ‘రంగితరంగ’ కూడా వుండడం విశేషం. ఇప్పుడు ‘రాజరథం’ చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమవుతున్నారు నిరూప్‌ భండారి. ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్యతోపాటు అవంతిక శెట్టి నటిస్తున్నారు.

‘రంగితరంగ’ చిత్రంలో దర్శకుడు అనూప్‌, నిరూప్‌ల టాలెంట్‌ చూసిన జాలీహిట్స్‌ ప్రై. లిమిటెడ్‌ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి వారిద్దరితో ఓ మంచి ఎంటర్‌టైనర్‌ని నిర్మించడానికి డిసైడ్‌ అయ్యారు. నిరూప్‌ భండారి హీరోగా, అనూప్‌ భండారి దర్శకత్వంలో ‘రాజరథం’ చిత్రాన్ని నిర్మించారు అజయ్‌రెడ్డి గొల్లపల్లి.

రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ‘రాజరథం’ చిత్రంలో నిరూప్‌ కాలేజ్‌ స్టూడెంట్‌గా నటిస్తున్నారు. బాలనటుడిగా ‘జాలీ జాలీ పిక్నిక్‌’ అనే టి.వి. సీరియల్‌లో నటించారు నిరూప్‌. థియేటర్‌ యాక్టింగ్‌ ద్వారా నటనలోని స్కిల్స్‌ని పెంపొందించుకున్నారు. నిరూప్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ కమిటెడ్‌ యాక్టర్‌. క్యారెక్టర్‌ కోసం ఎలాంటి రిస్క్‌ తీసుకోవడానికైనా అతను సిద్ధంగా వుంటారు. ‘రంగితరంగ’ షూటింగ్‌ టైమ్‌లో తడి నేలపై స్పిన్‌ డాన్స్‌ను చాలా అద్భుతంగా చేశారు నిరూప్‌. ఈ సందర్భంలో నిరూప్‌ స్లిప్‌ అయి పడిపోవడం వల్ల తలకి పెద్ద గాయమైంది. అలాగే ‘రాజరథం’ చిత్రంలో కూడా కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లకు డూప్‌ని ఉపయోగించడానికి నిరూప్‌ అంగీకరించలేదు. డూప్‌ లేకుండానే రిస్క్‌ తీసుకొని యాక్షన్‌ సీక్వెన్స్‌లను పూర్తి చేశారు. ఆ సమయంలో చేతికి రెండు గాయాలయ్యాయి. దాంతో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్‌ సూచించారు. దీనివల్ల ‘రాజరథం’ టైటిల్‌ సాంగ్‌ చిత్రీకరణ ఆలస్యమైంది.


ముంబాయికి చెందిన అవంతిక శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా యాడ్‌ ఫిలింస్‌లో అల్లు అర్జున్‌ వంటి స్టార్స్‌తో కలిసి ఆమె నటించింది. నిరూప్‌ తదుపరి చిత్రాల్లో పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌, ఒక టాలీవుడ్‌ టాప్‌స్టార్‌ నటించే మల్టీస్టారర్‌ చిత్రం ఒకటి వుంది. ఈ చిత్రాన్ని అనూప్‌ భండారి డైరెక్ట్‌ చేస్తున్నారు. పాపులర్‌ హీరోయిన్‌ రాధిక పండిట్‌తో కలిసి నిరూప్‌ ఓ చిత్రంలో నటిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మించే ఈ చిత్రానికి మణిరత్నం అసోసియేట్‌ డైరెక్టర్‌ ప్రియ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ భండారి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత అనూప్‌, నిరూప్‌ అందించిన కథతో తెలుగులో ఓ గ్యాంగ్‌స్టర్‌ చిత్రాన్ని ‘కిరిక్‌ పార్టీ’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందనుంది.

‘రాజరథం’ చిత్రంలో ఆరు మెలోడీ, ఫాస్ట్‌ బీట్‌ సాంగ్స్‌ని అనూప్‌ భండారి కంపోజ్‌ చేశారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు రాశారు. తమిళ హీరో ఆర్య ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ‘నిరూప్‌ కామ్‌గా వుంటారు. డైరెక్టర్‌ యాక్షన్‌ చెప్పగానే ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఫుల్‌ ఎనర్జీతో క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోతారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తారు. నిరూప్‌ స్క్రీన్‌పై సూపర్‌ హ్యాండ్‌సమ్‌గా వుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు” అన్నారు ఆర్య. ‘రాజరథం’ చిత్రం జాలీహిట్స్‌ ప్రై. లిమిటెడ్‌ బేనర్‌పై అజయ్‌రెడ్డి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్‌ శాస్త్రి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సుధాకర్‌ సాజ.