హీరోయిన్స్ – ఏజ్ కి మించి

Tuesday,October 22,2019 - 11:03 by Z_CLU

కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’ లో నటించే అవకాశం దక్కించుకున్న కాజల్ అగర్వాల్, తన కరియర్ లోనే మునుపెన్నడూ కనిపించని లుక్స్ లో కనిపించనుంది. ఈ సినిమాలో 70 ఏళ్ళు పై బడిన ముసలావిడగా కనిపించనుంది. అదొక్కటేనా ఈ క్యారెక్టర్ కోసం స్పెషల్ గా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంటుంది కాజల్. దీంతో ఇప్పటికే తమ ఏజ్ గ్రూప్ కి మించి ఉన్న క్యారెక్టర్స్ లో నటించి అదరగొట్టేసిన హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది కాజల్.

అనుష్క –  ‘బాహుబలి – ది బిగినింగ్’ లో అనుష్క కనిపించేది 50 ఏళ్ళు పైబడిన వయసులోనే. డీ-గ్లామర్ రోల్ అని చెప్పుకున్నా, స్ట్రాంగ్ రోల్ అని చెప్పుకున్నా ‘దేవసేన’గా సిల్వర్ స్క్రీన్ పై ఈ రాజమాత క్రియేట్ చేసిన వైబ్రేషన్స్ అంతా ఇంతా కాదు. ఓ రకంగా చెప్పాలంటే ‘బాహుబలి – ది బిగినింగ్’ కథ మొత్తం నడిచేది ఈ క్యారెక్టర్ కోసమే…

కీర్తి సురేష్ – తన ఏజ్ కి మించి ఉన్న క్యారెక్టర్ లో నటించే అవకాశం కీర్తి సురేష్ కి ‘మహానటి’ రూపంలో దొరికింది. కథ మొదట్లో యంగ్ సావిత్రిగా కనిపించినా, సావిత్రమ్మ లైఫ్ లోని లాస్ట్ మూమెంట్స్ లో కీర్తి సురేష్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసింది. ఈ ఫేజ్ కోసం పర్టికులర్ గా బరువు కూడా పెరిగింది.