50 దాటిన హీరోయిన్స్...

Friday,March 29,2019 - 12:03 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూసేస్తూ పెద్దగా లేక్కలేసుకోలేదు కానీ, ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లిస్టులో ఉన్న మ్యాగ్జిమం హీరోయిన్స్ 50 దాటేశారు. ఇక్కడ 50 అంటే ఏజ్ కాదు.. సినిమాలు. సమయానికి తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్ కావచ్చు , డెడికేటెడ్ గా చేసుకున్న కరియర్ ప్లానింగ్ కావచ్చు… ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మలు హీరోల కన్నా ఈజీగా 50 సినిమాలు దాటేశారు.

కాజల్ అగర్వాల్ :   ‘లక్ష్మీ కళ్యాణం’ తో ఇంట్రడ్యూస్ అయింది కాజల్ అగర్వాల్. అదే సంవత్సరం ‘చందమామ’ కూడా రిలీజవ్వడంతో ఒక్కసారిగా దశ తిరిగిపోయింది. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా ఓ సారి కాజల్ డేట్స్ చెక్ చేశాకే, మరో హీరోయిన్ కన్సిడర్ చేసే స్థాయిని అతి కొద్దికాలంలోనే అందుకుంది. తెలుగు, తమిళ హిందీ భాషలో కలిపి ఇప్పటికే 50 సినిమాలకు పైగా నటించేసింది.

తమన్నా : తెలుగు సినిమాకి మంచు మనోజ్ సినిమా ‘శ్రీ’ తో ఇంట్రడ్యూస్ అయినా, ‘హ్యాప్పీడేస్’ తో యూత్ కి మరింత దగ్గరయింది ఈ మిల్కీ బ్యూటీ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న భామ ‘సైరా’ తో 50 సినిమాలు కంప్లీట్ చేసుకోనుంది.

హన్సిక : అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన హన్సిక, జస్ట్ పదేళ్ళలో 50 సినిమాల మైల్ స్టోన్ దాటేసింది. ఈ అమ్మడు నుండి స్ట్రాంగ్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ, హన్సిక మళ్ళీ యంగ్ హీరోస్ తో నటిస్తూ, మళ్ళీ పాత క్రేజ్ క్రియేట్ చేసుకునే ప్లానింగ్ లో ఉంది.

నయనతార : లేడీ సూపర్ స్టార్. తెలుగులో డైరెక్ట్ గా చేసిన సినిమా ‘లక్ష్మి’ అయినా, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘చంద్రముఖి’ తోనే తెలుగు అడియన్స్ కి దగ్గరైంది. అటు భారీ కమర్షియల్ సినిమాల్లో హీరోల సరసన నటిస్తూనే, ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలతో హీరోలతో పోటీ పడుతున్న నయనతార ఇప్పటికే 70 నంబర్ ని కూడా దాటేసింది.

శ్రియ శరన్ : ఏకంగా 85 సినిమాల్లో నటించింది. రీసెంట్ గా పెళ్ళి చేసుకున్న శ్రియ కొంచెం స్పీడ్ తగ్గినట్టు అనిపించినా, మంచి కథలు దొరకాలి కానీ, ఇప్పటికీ శ్రియ స్థానం శ్రియదే అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ భామ ఇప్పటికే 85 సినిమాలు కంప్లీట్ చేసుకుంది.

ఇంకా ఈ లిస్టులో చేరడానికి జస్ట్ 4, 5 సినిమాల తేడాతో సమంతా, అనుష్క, నిత్యా మీనన్ పోటీ పడుతున్నారు. త్వరలో వీళ్ళు కూడా ఈజీగా 50 దాటేస్తారు.