కాబోయే భర్తలో క్వాలిటీస్

Thursday,August 13,2020 - 04:33 by Z_CLU

కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు హీరోయిన్లు. మరి అలాంటి హీరోయిన్లకు నిద్ర లేకుండా చేసే మగాళ్లు ఎలా ఉండాలి. ఈ విషయాల్ని స్వయంగా కొంతమంది హీరోయిన్లు బయటపెట్టారు. తమ కలల రాకుమారుడు, కాబోయే భర్తలో ఏ క్వాలిటీస్ ఉండాలో చెప్పుకొచ్చారు.

నివేత థామస్ – నాకు కాబోయే భర్తకు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండాలి. ఎందుకంటే నాక్కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అలాంటి వ్యక్తిని పెళ్లాడితే.. లైఫ్ లో చాలా చూడొచ్చు. ఎన్నో మధురమైన ప్రయణాలు చేయొచ్చు.

రాశి ఖన్నా – ప్రేమ పెళ్లి లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఏదిష్టం అని అడుగుతున్నారు. నాకైతే ప్రేమించి పెళ్లాడ్డమే ఇష్టం. అలాఅని నేను ప్రేమలో లేను. ప్రస్తుతానికి నేను సింగిల్. నాకు కాబోయే భర్త పొడుగ్గా ఉండాలి. ఎందుకంటే నేను కాస్త హైట్ ఉంటాను. మంచి హృదయం
ఉన్నవాడై ఉండాలి.

ప్రణీత – నేను హైట్ గా ఉంటాను కాబట్టి, నాకు కాబోయే వాడు కూడా కనీసం 6 అడుగులు ఉండాలి. 6 అడుగుల 4 అంగుళాలు ఉన్నా తనకు ఇబ్బంది లేదని చెబుతోంది.

అదా శర్మ – నాకు కాబోయే భర్త దోస, చట్నీ బాగా చేయాలి. మరీ ముఖ్యంగా జంతుప్రేమికుడై ఉండాలి.

రకుల్ – నాకు కాబోయే భర్తలో ముఖ్యంగా 3 లక్షణాలు ఉండాలి. అతడు కనీసం 6 అడుగులు ఉండాలి. నేను హై-హీల్స్ వేసుకున్నా కూడా నాకంటే హైట్ ఉండాలి. ఇక రెండో క్వాలిటీ ఏంటంటే.. మనిషి నిజాయితీగా, సరదాగా ఉండాలి. మూడో లక్షణం ఏంటంటే.. రెగ్యులర్, రొటీన్ జాబ్ చేసే వ్యక్తి వద్దు. జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉంటూ, రొటీన్ జాబ్ ను ఇష్టపడని వ్యక్తి నాకు భర్తగా కావాలి.

త్రిష – మనిషి పెద్దగా కలర్ లేకపోయినా ఫర్వాలేదు. కానీ చాలా స్మార్ట్ గా ఉండాలి. సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే అదనపు అడ్వాంటేజ్.

ఇషా చావ్లా – నాకు కాబోయే భర్త కళ్లలో నిజాయితీ కనిపించాలి. మంచి మనసు ఉండాలి. నాతో సరదాగా ఉండాలి. నేను చేసే ప్రతి పనిని జడ్జి చేసేలా ఉండకూడదు. అంతకుమించి నాకు పెద్దగా క్వాలిటీస్ అక్కర్లేదు.