ఈ హీరోయిన్లు ఇవి మిస్సయ్యారు

Wednesday,August 26,2020 - 04:31 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా సినిమా షూటింగ్స్, ఫొటో షూట్స్ మిస్సవుతున్నారు. అయితే వీటితో పాటు వ్యక్తిగతంగా మరికొన్ని కూడా వాళ్లు మిస్ అయ్యారు. అలా ఏ హీరోయిన్ ఏం మిస్సయిందో చూద్దాం

కియరా అద్వానీ
ఈ లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు బాగా మిస్ అవుతున్నాను. ఫ్రీ టైమ్ దొరికితే చాలు ఫ్రెండ్స్ తో కలిసి మల్టీప్లెక్స్ కు వెళ్లి, పాప్ కార్న్ తింటూ సినిమా చూడడం చాలా సరదా. ఆ ఫన్ బాగా మిస్ అవుతున్నాను.

కాజల్
ఆంధ్రా వంటకాల్ని బాగా మిస్ అవుతున్నాను. షూటింగ్స్ లో ఉన్నప్పుడు రకరకాల ఆంధ్రా వంటకాలు తినేదాన్ని. ఇప్పుడు షూటింగ్స్ లేవు కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ మిస్ అవుతున్నాను. సెట్స్ పైకి వెళ్లిన వెంటనే రకరకాల ఆంధ్రా వంటకాలు తెప్పించుకొని తింటాను.

సాయేషా సైగల్
లైవ్ లో అందరి ముందు డాన్స్ పెర్ఫార్మ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఈమధ్య ఆ ఫీలింగ్ మిస్ అయింది.

శ్రద్ధాదాస్
ఖాళీ టైమ్ దొరికితే సౌత్ ఏషియాలో చక్కర్లు కొట్టడం అలవాటు. లాక్ డౌన్ వల్ల విదేశీ పర్యటనల్ని బాగా మిస్ అవుతున్నాను. ఈసారి అన్నీ అనుకూలిస్తే మరోసారి ఇండోనేషియా వెళ్తాను.

నిధి అగర్వాల్
ప్రతి బర్త్ డే కు సెట్స్ లోనే కేక్ కట్ చేయడం నాకు ఇష్టం. ఈసారి లాక్ డౌన్ వల్ల అది మిస్ అయ్యాను.

సీరత్ కపూర్
అందరూ ఇంట్లో టీవీ చూస్తున్నారు. ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ అంటున్నారు. నాకు మాత్రం థియేటర్ కు వెళ్లి సినిమా చూడ్డమే ఇష్టం. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే అర్జెంట్ గా థియేటర్ కు వెళ్తాను.