ట్రెడిషనల్ లుక్స్ లో హీరోయిన్స్

Tuesday,August 27,2019 - 11:02 by Z_CLU

‘శ్రీదేవిగా అదిరిపోయింది పూజాహెగ్డే. అందునా లంగా ఓణీలో…’ ఇంకేముంది సోషల్ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటివరకు మాడ్రన్ గెటప్స్ లో ఫ్యాన్స్ గుండెల్లో హీట్ జెనెరేట్ చేసే పూజా..  ఇలా ట్రెడిషనల్ గా కనిపించేసరికి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. హాట్ అండ్ ట్రెండీ లుక్స్ లో ఫ్యాషన్ ఐకాన్ లా ఉండే ఈ భామ ‘వాల్మీకి’ లో ఈ లంగా ఓణీలో పల్లెటూరి తెలుగమ్మాయిలా మెస్మరైజ్ చేయనుంది. రీసెంట్ టైమ్స్ లో ఇలా ట్రెడిషనల్ లుక్స్ లో మరికొంతమంది హీరోయిన్స్ కనిపించారు.

రణరంగం: ఈ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాలో శర్వానంద్ సరసన కనిపించింది కళ్యాణి. ‘హలో’ సినిమాతో పరిచయం అయిన ఈ యంగ్ హీరోయిన్ లంగా ఓణీ కట్టింది ఈ సినిమాలోనే. ఇన్నోసెంట్ లుక్స్ తో అదిరిపోయే పెర్ఫామెన్స్ తో మన తెలుగమ్మాయే అనిపించుకుంది.

దొరసాని: 1980 బ్యాక్ డ్రాప్.. ‘దొరసాని’ అన్న పదానికి సరైన రూపం అనిపించుకుంది శివాత్మిక రాజశేఖర్. ఈ డెబ్యూ హీరోయిన్ లుక్స్ విషయంలో జీవిత రాజశేఖర్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం విశేషం.

రంగస్థలం : సమంతా కరియర్ లో ఈ సినిమా ఓ స్పెషల్ పేజ్. డీ గ్లామరస్ ట్రెడిషనల్ లుక్స్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సమాంత పర్ఫామెన్స్ హీరోయిన్ గా తన స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది.

ప్రస్తుతం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లవ్ ఎంటర్ టైనర్ ‘ఉప్పెన’ లో డెబ్యూ హీరోయిన్ కృతి శెట్టి కూడా ఇలాంటి ట్రెడిషనల్ లుక్స్ లోనే కనిపించబోతుంది.