క్రేజీ మల్టీస్టారర్ లో హీరోయిన్స్ ఫిక్స్

Monday,March 26,2018 - 03:31 by Z_CLU

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘F2’ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాకి ఫన్ & ఫ్రస్టేషన్ అనే ట్యాగ్ లైన్ ఫిక్స్ చేసిన సినిమా యూనిట్, నిన్న ఈ సినిమా లోగో లాంచ్ చేశారు.

అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్ సరసన నటించనున్న హీరోయిన్స్ విషయంలో ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఫిల్మ్ మేకర్స్ నుండి ఎటువంటి అఫీషియల్  అప్ డేట్ అయితే రాలేదు కానీ,  ఈ సినిమాలో వెంకీ సరసన అమలా పాల్, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ కౌర్ ఫిక్సయ్యారనే టాక్, టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

‘పటాస్’, ‘సుప్రీమ్’, తరవాత రీసెంట్ గా ‘రాజా ది గ్రేట్’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టిన అనిల్ రావిపూడి టైటిల్ కి తగ్గట్టే మోస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.