వరుణ్ తేజ్ కి బాగా కలిసొచ్చిన ఎలిమెంట్

Monday,April 09,2018 - 04:34 by Z_CLU

రీసెంట్ సూపర్ హిట్ ‘తొలిప్రేమ’ తరవాత సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో స్పేస్ ఎంటర్ టైనర్ కి రెడీ అవుతున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు ఈ హీరో. అయితే లవర్ బాయ్ లా క్రేజ్ క్రియేట్ చేసుకున్న వరుణ్ తేజ్, ఈ సినిమాలోను లవ్ ఆంగిల్ ఉండేలా కేర్ తీసుకుంటున్నాడు. తొలిప్రేమ సక్సెస్ తరవాత చేసే సినిమా ఏదైనా, తనకు బాగా కలిసొచ్చిన లవ్ ఎలిమెంట్ హైలెట్ అయ్యేలా చూసుకుంటున్నాడు.

మ్యాగ్జిమం ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి సంకల్ప్ రెడ్డి సినిమాతో సెట్స్ పైకి వచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు వరుణ్ తేజ్. అయితే ఈ సినిమాలో ఈ మెగా హీరో సరసన లావణ్య త్రిపాఠితో పాటు అదితి రావు హైదరి హీరోయిన్స్ గా ఫిక్సయ్యారు. దీంతో ఈ సినిమా సంకల్ప్ రెడ్డి మార్క్ సైన్స్ ఎలిమెంట్స్ తో పాటు ఇమోషనల్ లవ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

 

 

వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్ గా నటిస్తున్న ఈ సినిమాని రాజీవ్ రెడ్డి, సాయిబాబు తో పాటు శ్రీనివాస్ సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారు.