శర్వానంద్ సినిమాకి హీరోయిన్స్ ఫిక్స్

Thursday,November 02,2017 - 10:03 by Z_CLU

మహానుభావుడు సక్సెస్ తరవాత సుధీర్ వర్మతో అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ కి రెడీ అవుతున్నాడు శర్వానంద్. సినిమా సెట్స్ పైకి రాకముందే మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, ఈ సినిమా హీరోయిన్స్ ని ఆల్ రెడీ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

 

ఈ విషయంలో సినిమా యూనిట్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, నివేద థామస్ తో పాటు అర్జున్ రెడ్డి ఫేం షాలినీ పాండే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించనున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శర్వానంద్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్న ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించనున్నారు.