అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్న అఖిల్

Tuesday,June 18,2019 - 02:53 by Z_CLU

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అఖిల్. సినిమా లాంఛింగ్ కూడా పూర్తయింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఎట్టకేలకు ఈ మూవీ రెగ్యులర్ షూట్ కు డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 26 నుంచి అఖిల్ నాలుగో సినిమా సెట్స్ పైకి రాబోతోంది.

ఈ సినిమాకు హీరోయిన్ ను ఎంపిక చేయడం కాస్త కష్టంగా మారింది యూనిట్ కు. ఓ అందమైన తెలుగమ్మాయి కోసం ఆమధ్య ప్రయత్నించారు. కానీ అది వర్కవుట్ కాలేదు. మూవీ లాంచింగ్ లేట్ అవ్వడానికి కూడా ఇదొక కారణం.

ప్రస్తుతం కొత్తమ్మాయిలతో పాటు లైమ్ లైట్ లో ఉన్న హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ మేటర్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. అయితే దీంతో సంబంధం లేకుండా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యారు. హీరోయిన్ తో సంబంధం లేని షాట్స్ అన్నీ అఖిల్ పై పూర్తిచేయాలని నిర్ణయించారు.

గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు ట్యూన్స్ అందించే పనిలో బిజీగా ఉన్నాడు.