తాప్సీ గేమ్ ప్లాన్

Tuesday,June 11,2019 - 02:02 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది తాప్సీ. ఒక పర్టికులర్ లాంగ్వేజ్ కి ఫిక్స్ అయిపోకుండా అటు బాలీవుడ్ లో నటిస్తూనే తెలుగు, తమిళ సినిమాలకు కూడా సంతకం చేస్తుంది. బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా తెలుగులో కనీసం ఒక్క సినిమా అయినా గ్యారంటీగా చేస్తానని రీసెంట్ గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.

ఇప్పటికే హిందీలో 3 సినిమాల్లో నటిస్తుంది తాప్సీ. వీటి మధ్య రీసెంట్ గా ఓ తమిళ సినిమాకి కూడా కాల్షీట్లు ఇచ్చింది. సాధారణంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హీరోయిన్స్ బిజీగా ఉండటం పెద్ద విషయం కాదు కానీ, తాప్సీ సక్సెస్ ని కూడా ఒకే గ్రాఫ్ లో మెయిన్ టైన్ చేస్తుంది.

గట్టిగా ఓ రెండేళ్ళ గ్యాప్ వస్తే మళ్ళీ కొత్తగా క్రేజ్ క్రియేట్ చేసుకోవడం ఎవ్వరికైనా కొంచెం కష్టమే. అందుకే కంప్లీట్ గా ఒకే ఇండస్ట్రీకి పరిమితం కాకుండా, మినిమం గ్యాప్ లో సౌత్ లో కూడా సినిమా చేయాల్సిందేనని రూల్ పెట్టుకుని మరీ, సినిమాలు చేస్తుంది.

దానితోడు అది హిందీ అయినా, తెలుగు, తమిళ సినిమా అయినా జోనర్ ఏదైనా…  తాప్సీ సినిమా రిలీజవుతుందంటే కంటెంట్ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఆడియెన్స్ లో ఉంది. దాంతో 3 భాషల్లోనూ సక్సెస్ ఫుల్ గా నటించేస్తుంది తాప్సీ.