Heroine Nazriya - స్పెషల్ ఫిలిం ఇది

Monday,April 19,2021 - 01:36 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇతర భాషా హీరోయిన్స్ సత్తా చాటుతూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పుడీ లిస్టులో మరో హీరోయిన్ చేరబోతుంది. మలయాళ బ్యూటీ నజ్రియా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఇప్పటికే తమిళ్ డబ్బింగ్ సినిమా ‘రాజా రాణి’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నజ్రియా ఎట్టకేలకు తెలుగులో సినిమా చేస్తుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వనుంది నజ్రియా.

ఈరోజే ఈ సినిమా షూటింగ్ లో అడుగుపెట్టింది నజ్రియా. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “అందరికీ నమస్కారం…ఈరోజు నా మొదటి తెలుగు సినిమా షూట్ లో పాల్గొంటున్నాను. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ … అంటే సుందరానికి విల్ బీ స్పెషల్” అంటూ ఈ సినిమా తనకి ఎంత స్పెషల్ అనే విషయాన్ని చెప్తూ ఫ్యాన్స్ తో సంతోషాన్ని పంచుకుంది.

ఇక నజ్రియా కి వెల్కం చెప్తూ అనుపమ పరమేశ్వరన్, రాశీ ఖన్నా సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. మరికొందరు సెలెబ్రిటీస్ కూడా ఆమెకి ఆల్ ది బెస్ట్ చెప్తూ విష్ చేశారు.

  • nazriya fahad zeecinemalu

నిజానికి ‘రాజారాణి’ తర్వాత నజ్రియాకి తమిళ్, తెలుగు సినిమాల్లో చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆఫర్స్ పక్కన పెట్టి మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఆ తర్వాత అతి కొద్ది సినిమాలు మాత్రమే చేసింది. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ గా బిజీ అవ్వాలని చూస్తుంది.

  • nazriya zeecinemalu

ముందుగా నాని సినిమాతో తెలుగులో తన లక్ చెక్ చేసుకోబోతుంది. మరి హీరోయిన్ గా ఇప్పటికే అవార్డులు , అభినందనలు అందుకున్న నజ్రియా ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా బిజీ అవుతుందేమో చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics