హీరోయిన్ కృతి శెట్టి ఇంటర్వ్యూ

Tuesday,February 09,2021 - 01:56 by Z_CLU

ఇంకా మొదటి సినిమా విడుదల కాలేదు. ఎలా నటించిందో తెలియదు. కానీ అప్పుడే ఫ్యాన్ బేస్ సంపాదించేసుకుంది. హీరోయిన్ గా మరో రెండు సినిమాలు పట్టేసింది. ఆ అమ్మాయే కృతి శెట్టి.  మరో మూడు రోజుల్లో బెబ్బమ్మ గా ఆకట్టుకొని టాలీవుడ్ లో మరింత బిజీ అవ్వబోతున్న కృతి తన మొదటి సినిమా ఎక్స్ పీరియన్స్ మీడియాతో షేర్ చేసుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…

ఫ్రం ముంబై 

మాది బెంగళూరు. కానీ నేను పుట్టి పెరిగింది ముంబైలో. అక్కడ కొన్ని యాడ్స్ చేశాను. ఆ యాడ్స్ లో మంచి పేరొచ్చింది.

డాక్టర్ అవ్వాలనుకున్నా 

సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ట్రై కూడా చేయలేదు. కానీ యాక్టింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఆసక్తితోనే కొన్ని యాడ్స్ చేశాను. సైకాలజీ చదివి డాక్టర్ అవ్వాలనుకున్నా. కానీ అనుకోకుండా ఈ సినిమా ఆఫర్ వచ్చింది. కథ బాగుంది చేయొచ్చనిపించింది. అలా డాక్టర్ నుండి యూ టర్న్ తీసుకొని యాక్టర్ గా మారాను.

కో ఇన్సిడెన్స్

నిజానికి నాలాగే వైష్ణవ్ తేజ్ కి కూడా సినిమా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆ విషయం ఈ మధ్యనే ప్రమోషన్స్ లో నాకు తెలిసింది. అది కో ఇన్సిడెన్స్ అనిపించింది. నాకు చాలా సపోర్ట్ చేశారు. హీ ఈజ్ బ్రిలియంట్ యాక్టర్. రిలీజ్ అయ్యాక  మీరు కూడా అదే చెప్తారు. సీన్ లో అవతలి నటులకి తన నటనతో వైష్ణవ్ ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తారు.

తెలుగు నేర్చుకున్నా 

కథ విన్నాక. ఈ క్యారెక్టర్ కోసం కచ్చితంగా తెలుగు నేర్చుకోవాలనుకున్నా. బుచ్చి గారు నాకు సీన్, డైలాగ్స్ అన్ని తెలుగులోనే చెప్పేవారు. అలా చెప్పే టప్పుడు మెల్ల మెల్లగా లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే దాన్ని. షూటింగ్ టైంలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వివేక్ , రామన్ నాకు తెలుగు నేర్చుకోవడానికి బాగా హెల్ప్ చేశారు.

హైపర్ ఆక్టివ్ 

నా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో బెబ్బమ్మ క్యారెక్టర్ కి చాలా తేదీ ఉంది. బెబమ్మ చాలా హైపర్ ఆక్టివ్ గర్ల్. ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. ఇంట్రో సీన్ కోసం చాలా టైం తీసుకున్నా. మొదటి సీన్ కి చాలా టెక్స్ తీసుకున్నా. కానీ డైరెక్టర్ బుచ్చి గారు టీం బాగా సపోర్ట్ చేసి నాతో చేయించారు.

అది బెస్ట్ మూమెంట్ 

షూటింగ్ జరుగుతుండగా నేను నటించిన ఒక ఎమోషనల్ సీన్ చూసి సెట్ లో ఒక వ్యక్తి ఏడ్చాడు. అది చూసి నటిగా నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. షూటింగ్ టైం లో అదే నాకు బెస్ట్ మూమెంట్

చాలా క్యూట్ 

విజయ్ సేతుపతి గారు చాలా క్యూట్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, అదీ మొదటి సినిమాకే అవ్వడం నా అదృష్టం అనిపిస్తుంది. ఆయనతో పెద్ద సీన్ చేయాలి అన్నప్పుడు చాలా భయపడ్డాను. కానీ ఆయన దగ్గరికి వెళ్లి సీన్ చేసే ముందు భయమంతా పోయింది. యాక్టింగ్ లో చాలా టిప్స్ చెప్పేవారు. యాక్టింగ్ లో ఆయన సూపర్బ్.

అది సాంగ్ లో పెట్టారు

నా డాన్స్ క్లిప్ ఒకటి చూసి అందులో నేను వాడిన కంటి మూమెంట్ ని బుచ్చి బాబు  గారు సినిమాలో వచ్చే  సాంగ్ లో పెట్టారు. సాంగ్ లో నేనిచ్చిన ఆ కంటి మూమెంట్ అందరికి బాగా నచ్చింది. ఐయాం వెరీ హ్యాపీ.

చిరంజీవి గారు తెలుసు 

టాలీవుడ్ లో డైరెక్టర్స్ , యాక్టర్స్ నాకు పెద్దగా తెలియదు. చిరంజీవి గారు మాత్రం తెలుసు. ఆయన మెగాస్టార్ గా అందరికి తెలుసు. ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్ లోనే సుకుమార్ గారి గురించి కూడా తెలుసుకున్నా. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో అందరి గురించి తెలుసుకుంటున్నా.

ఆయన ఇచ్చిన ధైర్యమే 

ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాక. నాలో భయం మొదలైంది. బెబమ్మ పాత్రకు నేను ఎంత వరకు న్యాయం చేయగలను ? అనుకునే స్టేజిలో నాకు సుకుమార్ గారు దైర్యమిచ్చి గో హెడ్ అన్నారు. ఆయనిచ్చిన ధైర్యంతో డైరెక్టర్ బుచ్చి గారి సపోర్ట్ తో ఈ క్యారెక్టర్ ని ఇంత బాగా చేయగలిగాను.

ఆ రెండు నా ఫేవరేట్

దేవి గారి మ్యూజిక్  సినిమాకు బిగ్గెస్ట్ ఎస్సెట్. “నీ కన్ను నీలి సముద్రం” సాంగ్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది. ఆల్బంలో “నీ కన్ను నీలి సముద్రం” , “జల జల జలపాతం నువ్వు” నా ఫేవరేట్ సాంగ్స్.

ఎంజాయ్ చేశాను 

ఉప్పాడ లో షూట్ చేసినన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశాను. రేపు షూట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేసేదాన్ని. ఆ వాతావరణం , పీపుల్ నాకు బాగా నచ్చాయి.

బెస్ట్ కాంప్లిమెంట్ అదే 

సినిమా చూసాక నా పెర్ఫార్మెన్స్ గురించి సుకుమార్ గారు , రవి గారు , కొరటాల శివ గారు మాట్లాడారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా స్టార్ చిరంజీవి గారు నా గురించి చెప్పడం ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్.

రెండు సినిమాలు 

ప్రస్తుతం నాని గారితో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో పాటు సుదీర్ బాబు -ఇంద్రగంటి గారి మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నా. అవి అయ్యాక మిగతా సినిమాలు ఒప్పుకుంటాను.

Also Read వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ