HansikaMotwani: జైపూర్ లో హన్సిక పెళ్లి ?

Wednesday,November 02,2022 - 06:02 by Z_CLU

వైట్ బ్యూటీ హన్సిక పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతుంది. కొన్నేళ్ళుగా తన బిజినెస్ పార్టనర్ సోహైల్ తో ప్రేమలో ఉన్న హన్సిక ఎట్టకేలకు తన ప్రేమను పెళ్ళిగా మర్చబోతుంది. డిసెంబర్ 4న జైపూర్ లో వీరద్దరి పెళ్లి ఘనంగా జరగబోతుంది. ఇందు కోసం ఇప్పటి నుండే  ఏర్పాట్లు మొదలు పెట్టారు. కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరగనుందని తెలుస్తుంది. తాజాగా తన పెళ్లి విషయం ఎనౌన్స్ చేసి సోషల్ మీడియాలో కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది హన్సిక.

‘దేశముదురు’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక  స్టార్ హీరోలతో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.   ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ గా ‘మై నేమ్ శృతి’, ‘105 మినట్స్’ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న హన్సిక తమిళ్ లో ‘రౌడీ బేబీ’ సినిమా చేస్తుంది.