నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ హీరోయిన్ ఫిక్సయింది

Friday,January 05,2018 - 11:02 by Z_CLU

నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కనున్న శ్రీనివాస కళ్యాణం సినిమా హీరోయిన్ ఫిక్సయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా హీరోయిన్ విషయంలో నిన్నా, మొన్నటి వరకు క్రియేట్ అయి ఉన్న సస్పెన్స్ వీడింది. అల్లు అర్జున్ DJ తో సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకున్న పూజా హెగ్డే ఈ సినిమాలో నితిన్ తో జత కట్టనుంది.

 

‘శతమానం భవతి’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం రిలీజైన ‘దిల్’ సినిమా తరవాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాని మ్యాగ్జిమం మార్చి లోగా సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.