మహేష్ బాబు కొత్త సినిమా హీరోయిన్ ఫిక్సయింది

Wednesday,January 31,2018 - 05:35 by Z_CLU

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘భరత్ అనే నేను’ మూవీ తరవాత ఇమ్మీడియట్ గా వంశీ పైడిపల్లి సినిమాతో సెట్స్ పై ఉంటాడు మహేష్ బాబు. అయితే ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్, ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసుకుంది. రీసెంట్ గా బన్ని సరసన DJ సినిమాలో నటించి మెస్మరైజ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు మహేష్ బాబు సరసన నటించనుంది. ఈ విషయాన్ని స్వయంగా తనే   ట్వీట్ చేసి అనౌన్స్ చేసింది.

మహేష్ బాబు 25 వ సినిమా కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి కూడా రాకముందే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. అశ్విని దత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రియల్ లో సెట్స్ పైకి రానుంది.  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.