ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ?

Wednesday,January 29,2020 - 10:09 by Z_CLU

ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కథ ఫైనల్ అయిన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. హారికా & హాసినీ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే మహేష్ తో నటించిన స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిన రష్మిక నెక్స్ట్ బన్నీ తో సినిమా చేయనుంది. త్వరలోనే మేకర్స్ హీరోయిన్ గా రష్మిక పేరు ప్రకటించే అవకాశం ఉంది.

ప్రెజెంట్ ‘ఆర్ ఆర్ ఆర్’షూటింగ్ లో బిజీ ఉన్న తారక్ ఆ సినిమా పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలనే ప్లానింగ్ లో ఉన్నారు. ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినాకు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.