మహేష్ కి హీరోయిన్ ఫిక్స్....

Tuesday,April 18,2017 - 09:00 by Z_CLU

గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న’భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ ఫిక్స్ అయింది. మొన్నటి వరకూ ఈ సినిమాలో మహేష్ సరసన పలు స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించగా లేటెస్ట్ గా ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వాని..


ఇప్పటికే ఈ అమ్మడు మహేష్ తో నటిస్తుందనే వార్త వారం రోజులుగా టాలీవుడ్ లో చక్కర్లు కొట్టగా ఇప్పుడు అదే నిజమైంది. ఇటీవలే ఈ భామ ఈ సినిమాకు సైన్ చేసిందని.. సినిమాలో మహేష్ సరసన కీ రోల్ పోషించనుందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మంచి మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. మహేష్ ఇందులో ఎన్నారై గా కనిపిస్తాడని టాక్.