'మహాసముద్రం'... హీరోయిన్ ఫిక్స్?

Monday,July 06,2020 - 01:44 by Z_CLU

‘ఆర్ ఎక్స్ 100’తో బ్లాక్ బస్టర్ డెబ్యు ఇచ్చిన అజయ్ భూపతి త్వరలోనే శర్వానంద్ హీరోగా ‘మహాసముద్రం’ అనే సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే స్టార్ట్ అవుతుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.

సినిమాలో శర్వా సరసన హీరోయిన్ గా రాశి ఖన్నా ను తీసుకున్నారట. ఇటివలే రాశి కి సబ్జెక్ట్ చెప్పడం, అజయ్ చెప్పిన స్క్రిప్ట్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.

ప్రస్తుతానికి రాశి ఖన్నా, రవితేజ తో ఓ సినిమా సైన్ చేసింది. కానీ దాని కంటే ముందే శర్వా సినిమా వచ్చే చాన్స్ ఉంది. సినిమాలో మరో హీరో ఓ నెగిటివ్ రోల్ చేయనున్నాడని సమాచారం. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.