హీరోయిన్ భావన పెళ్లి ఫిక్స్

Saturday,December 24,2016 - 01:15 by Z_CLU

తెలుగులో మహాత్మ, ఒంటరి, హీరో లాంటి సినిమాలు చేసిన హీరోయిన్ భావన గుర్తుందా..? మలయాళీ సినిమాలతో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయింది. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న కన్నడ ప్రొడ్యూసర్ నవీన్ ను భావన పెళ్లాడనుంది. దాదాపు రెండేళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ పుకార్లు కూడా మీడియాలో వచ్చాయి. కానీ భావన ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. తాజాగా మాత్రం తను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. అయితే పెళ్లి డేట్ ఎప్పుడనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
bhavana-actress-photos-zee-cinemalu-1
వచ్చే ఏడాది ఏప్రిల్ లో పెళ్లి ఉంటుందనే వార్తల్ని భావన తల్లి కొట్టిపారేశారు. ఇంకా వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేయలేదని, ముహూర్తం ఖరారైన వెంటనే మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం భావన, మలయాళంలో హనీబీ అనే హిట్ సినిమాకు సీక్వెల్ లో నటిస్తోంది. దీంతో పాటు మలయాళంలో హిట్ అయిన చార్లీ సినిమా కన్నడ రీమేక్ లో కూడా భావన నటించనుంది.