Vakeelsaab గుర్తుండిపోయే సినిమా

Monday,April 05,2021 - 06:38 by Z_CLU

ఏప్రిల్ 9న గ్రాండ్ గా రిలీజవుతున్న ‘వకీల్ సాబ్‘ గురించి తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో తన సంతోషాన్ని బయట పెట్టింది అంజలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం మర్చిపోలేని ఓ గొప్ప మెమొరీ అంటూ చెప్పుకుంది. “కొన్ని క్యారెక్టర్స్ మన లైఫ్ లో గుర్తుండిపోతాయి. వకీల్ సాబ్ లో అలాంటి క్యారెక్టర్ చేశాను. వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడాలంటే పవన్ గారి గురించే మాట్లాడాలి. నా జీవితంలో గుర్తుండిపోయే సంఘటనల్లో పవర్ స్టార్ పవన్ గారితో కలిసి నటించడం ఒకటి. ఆయన మాతో మాట్లాడిన గొప్ప మాటలు మర్చిపోలేను. పవన్ గారు ఒక్కో సీన్ కు ప్రిపేర్ అయిన విధానం గురించి చెబితే టైమ్ సరిపోదు. ఇంతమంచి సినిమా, ఎక్సీపిరియన్స్ వకీల్ సాబ్ తో ఇచ్చినందుకు థాంక్స్ పవన్ గారు. దర్శకుడు వేణు గారికి, నా లక్కీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థాంక్స్” అంటూ క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకుంది తెలుగు ముద్దుగుమ్మ.