చిరు కి ఇంకా ఫిక్స్ అవ్వలేదట !

Monday,July 18,2016 - 08:11 by Z_CLU

 
ఎన్నో ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను తన నటన, డాన్సులతో అలరించి కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న మెగా స్టార్ చిరంజీవి తాజా గా తన 150 సినిమా ద్వారా కథానాయకుడిగా రి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఆ మధ్య రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల కథానాయకుడిగా విరామం తీసుకున్న చిరు ఇటీవలే తన 150 సినిమాను ప్రారంభించి సెట్స్ పై పెట్టేసారు. తమిళ చిత్రం ‘కత్తి’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా చిరు తనయుడు రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్’ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం లో చిరు సరసన నటించే కథానాయిక ఇంకా ఫిక్స్ అవ్వలేదని సమాచారం. ముందుగా ఈ చిత్రానికి కథానాయికగా అనుష్క, నయనతార లను సంప్రదించారు యూనిట్ కానీ డేట్స్ లేకపోవడం తో ఈ సినిమాకు ఈ సీనియర్ నాయికలు నో చెప్పినట్లు టాక్. అయితే ఆ తరువాత కొందరు బాలీవుడ్ భామ లతో కూడా నిర్మాత రామ్ చరణ్ సంప్రదింపులు జరిపారని వినికిడి. అయితే వారి రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండడం తో ఇంకా నాయిక విషయం లో డైలామాలోనే ఉన్నాడట చెర్రీ. ఇక ప్రస్తుతం చిరు పై సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట యూనిట్. మరి త్వరలోనే ఈ సినిమాలో మెగా స్టార్ సరసన నటించే భామ వివరాలు తెలుస్తాయని అంటున్నారు చిరు సన్నిహితులు. మరి ఈ ప్రతిష్టాత్మక చిత్రం లో చిరు సరసన నటించే భామ ఎవరో? తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే..