విలన్ గా మారిన హీరోలు

Tuesday,May 07,2019 - 11:03 by Z_CLU

హీరోలుగా కావాల్సినంత సక్సెస్… బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్… కొంచెం ప్రయోగమే అయినా పర్వాలేదు అనే కాన్ఫిడెన్స్… ఇవి ఉన్నాయి కాబట్టే బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు హీరోలు… జస్ట్ కథల్లో వేరియేషన్స్ మాత్రమే  కాదు క్యారెక్టర్స్ లో కూడా ఉండాలి అంటున్నారు. అందుకే ఉన్నపళంగా విలన్ రోల్స్ లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు.

నాని – V: టైటిల్ ని బట్టి సినిమాలో విలన్ కే ఎక్కువ స్కోప్ ఉన్నట్టనిపిస్తుంది. అందుకే నాని ఈ క్యారెక్టర్ ని ప్రిఫర్ చేశాడా..? ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ రెగ్యులర్ గా పక్కింటబ్బాయిలా కనిపించే రోల్ లో కాకుండా ఈ సారి విలన్ ఛాయలున్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట నాని. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కథ చెప్పిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కార్తికేయ : మహా అయితే చేసింది ఒక్క సినిమా. ఈ లోపే చాలా బోల్డ్ గా ఆలోచించాడు కార్తికేయ. అఫ్ కోర్స్ విక్రమ్ కుమార్, నాని కాంబినేషన్ లో సినిమా… అందులో నటించే అవకాశం రావడం అనేది చిన్న విషయం కాకపోయినా, హీరోగా కరియర్ ని ఆచి తూచి ప్లాన్ చేసుకోవాల్సిన టైమ్ లోనే విలన్ ఆప్షన్ ఎంచుకోవడమనేది.. కార్తికేయ ఏదో అలా వచ్చి ఇలా ఫేడ్ అవుట్ అయిపోయే యాక్టర్ కాదు అనే అభిప్రాయాన్ని  కలిగిస్తుంది.

వరుణ్ తేజ్ : ఈ మెగా హీరో ఇలాంటి సర్ ప్రైజింగ్ డెసిషన్ తీసుకోవడం మరీ షాకింగ్ గా లేదు కానీ, ఇంత తొందరగా ప్రయోగాల బాట పడతాడని మాత్రం ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు. ‘వాల్మీకి’ లో  వరుణ్ తేజ్ రెగ్యులర్ హీరోలా కాకుండా నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజైన లుక్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వరుణ్ తేజ్ ఎలాంటి రోలైనా ఈజీగా చేసేస్తాడనిపిస్తుంది.

ఏది ఏమైనా ఒక పర్టికులర్ ఇమేజ్ కి అస్సలు స్టిక్ అవ్వకుండా  డిఫెరెంట్ క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయాలనే ప్రయత్నం  చేస్తున్నారు హీరోలు.