హీరోలకి టైం దొరికింది

Tuesday,June 30,2020 - 11:02 by Z_CLU

లాక్ డౌన్ ముందు వరకు టాలీవుడ్ లో హీరోలందరూ ఎవరి ప్రాజెక్టులతో వారు ఫుల్ బిజీ గా ఉన్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్స్ వాయిదా పడే సరికి ఫ్రీ అయిపోయారు. ఇంటికే పరిమితమై కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఇలా ఫ్యామిలీకే కాకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ కథలు వింటున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్న మహేష్ కూడా లాక్ డౌన్ సమయంలోనే పరశురాం కథను ఫైనల్ చేసుకొని అనౌన్స్ చేశాడు. ఇక మిగతా హీరోలు కూడా అదే పనిలో ఉన్నారట.

తారక్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఫోనులో అందుబాటులో ఉంటూ కథా చర్చలు జరుపుతూనే నెక్ట్స్ సినిమాల కోసం కథలు వింటున్నాడని సమాచారం. ఇక రామ్ చరణ్ ఒకవైపు చిరు నెక్స్ట్ సినిమా కోసం సుజీత్ తో ‘లూసిఫర్’ స్టోరీ డిస్కస్ చేస్తూనే మరోవైపు తన నెక్స్ట్ సినిమాల కోసం కొందరు దర్శకులతో మాట్లాడుతున్నాడట.

ఇలా స్టార్ హీరోలే కాదు కుర్ర హీరోలు కూడా ఈ ఫ్రీ టైం ను సరిగ్గా వాడుకుంటూ తదుపరి సినిమాలకు కథలు వింటూ దర్శకులను ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ లెక్కన చూస్తే కరోనా ఎఫెక్ట్ చక్కబడిన వెంటనే టాలీవుడ్ లో హీరోలు వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం ఖాయం అనిపిస్తుంది.