మరోసారి తెరపైకి మెగాస్టార్ టైటిల్

Wednesday,July 31,2019 - 12:58 by Z_CLU

మెగాస్టార్ సినిమాకే కాదు, అతడి సినిమా టైటిల్స్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. వేరే హీరో మెగాస్టార్ టైటిల్ పెట్టుకుంటే వెంటనే ఆ ప్రాజెక్టుకు హైప్ వస్తుంది. అందుకే చాలామంది ఇప్పుడు చిరు టైటిల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా చిరంజీవి సినిమా టైటిల్స్ తో ఏకంగా 3 సినిమాలొస్తున్నాయి. ఆల్రెడీ అరడజనుకు పైగా చిరంజీవి సినిమా టైటిల్స్ తో సినిమాలు వచ్చేశాయి.

గ్యాంగ్ లీడర్.. చిరంజీవి కెరీర్ లో మరపురాని చిత్రం. మంచి కథ, మాస్ ఎలిమెంట్స్, సూపర్ హిట్ సాంగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే గ్యాంగ్ లీడర్ గురించి ఎంతో ఉంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని రామ్ చరణ్ చాన్నాళ్లుగా ప్రయత్నించాడు. అంతలోనే నాని ఆ టైటిల్ తో సినిమా స్టార్ట్ చేశాడు.

రాక్షసుడు.. ఇది కూడా చిరంజీవి సినిమా టైటిలే. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 80ల్లో వచ్చిన ఈ సినిమా చిరు కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచింది. ఇప్పుడీ టైటిల్ తో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఓ సినిమా చేశాడు. అంతేకాదు, ఇదే టైటిల్ తో సూర్య సినిమా కూడా వచ్చింది.

హీరో.. విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి చేసిన ఈ సినిమా మోస్ట్ ఎమోషనల్ మూవీగా పేరుతెచ్చుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఇదే టైటిల్ తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయడమే. ఆనంద్ అన్నామళై దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాకు హీరో అనే టైటిల్ పెట్టారు.

ఇవి మాత్రమే కాదు.. చిరంజీవి నటించిన ఎన్నో సినిమా టైటిల్స్ ను ఇతర హీరోలు వాడుకున్నారు. చాలామంది తమ డబ్బింగ్ సినిమాలకు కూడా పెట్టుకున్నారు. మగమహారాజు అనే టైటిల్ ను విశాల్ వాడుకుంటే.. ఖైదీ అనే టైటిల్ ను కార్తి వాడుకుంటున్నాడు. ఇక రోషగాడు టైటిల్ ను విజయ్ ఆంటోనీ ఇప్పటికే వాడేశాడు.

వీటితో పాటు జాతర, శుభలేఖ, విజేత, వేట, శ్రీరస్తుశుభమస్తు లాంటి చిరంజీవి నటించిన ఎన్నో సినిమా టైటిల్స్ మళ్లీ సినిమాలుగా వచ్చాయి.