ఆ సీక్వెల్స్ డైరెక్ట్ చేయబోతున్న Vishal

Friday,February 19,2021 - 02:51 by Z_CLU

ఇప్పటికే కొందరు హీరోలు మెగా ఫోన్ పట్టి దర్శకులుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్టులో హీరో విశాల్ కూడా చేరబోతున్నాడు. అవును ‘డిటెక్టివ్’ సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘డిటెక్టివ్ 2’ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు విశాల్.  సినిమా నుండి డైరెక్టర్ మిస్కిన్ ఉన్నపళంగా తప్పుకోవడంతో తనే డైరెక్ట్ చేసి సినిమాను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు విశాల్. అలాగే త్వరలోనే సెట్స్ పైకి రానున్న ‘అభిమన్యుడు’ సీక్వెల్ ‘అభిమన్యుడు 2’ సినిమాని కూడా విశాల్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తనే చెప్పుకున్నాడు.

ప్రస్తుతం నటుడిగా ‘చక్ర’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విశాల్ త్వరలోనే దర్శకుడిగా కూడా మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. మరి విశాల్ ఈ సీక్వెల్స్ తో ఎలాంటి హిట్స్ అందుకుంటాడు ? తనను డైరెక్ట్ చేసి సూపర్ హిట్స్ అందించిన దర్శకులను మైమరిపిస్తాడా ? వేచి చూడాలి.

త్వరలోనే ‘డిటెక్టివ్ 2’ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించనున్నాడు విశాల్. ఆ తర్వాత ‘అభిమన్యుడు 2’ ను ఎనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకొస్తాడు.