జెర్సీ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి

Tuesday,April 16,2019 - 02:29 by Z_CLU

నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి ఇక్కడికి రాలేదు. జెర్సీ లాంటి సినిమాలంటే నాకు ఇష్టం కాబట్టి వచ్చాను. ఫస్ట్ లుక్ నుంచే జెర్సీని ఫాలో అవుతున్నాను. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. అక్కడ్నుంచి విడుదలైన ప్రతి స్టిల్ చాలా రియలిస్టిక్ గా ఉంది. అందుకే ఈ ప్రాజెక్టులో నేను కూడా భాగం కావాలనుకున్నాను. వచ్చేశాను.”

మైక్ అందుకుంటూనే తను ఎందుకు జెర్సీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వచ్చానో చెప్పేశాడు వెంకీ. ఇలాంటి సినిమాలంటే తనకు ఇష్టమంటున్న వెంకీ.. ట్రయిలర్ చూసిన తర్వాత ఇక రాకుండా ఉండలేకపోయానన్నాడు. ఇలాంటి జెన్యూస్ సినిమాలు అరుదుగా వస్తుంటాయని.. ఏ నటుడైనా ఇలాంటి సినిమా మిస్ అవ్వకూడదని అన్నాడు వెంకీ.

గౌతమ్ ప్రతి ఫ్రేమ్ ను చాలా రియలిస్టిక్ గా తీశాడు. ట్రయిలర్ చూశాను, చాలా బాగా నచ్చింది. ఇలాంటి జెన్యూస్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి సినిమా నాని చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు చేసినప్పుడే మనలో నటుడు బయటకొస్తాడు. సినిమా అయిపోయినా వదలాలని అనిపించదు. చాలా ఎమోషనల్ అయిపోతాం.”

ప్రతి ఒక్కరు లైఫ్ లో స్ట్రగుల్ అవుతుంటారని.. కానీ అనుకున్నదాన్ని మధ్యలో వదిలేయకుండా చివరి వరకు పోరాడాలని, అదే విషయాన్ని జెర్సీ సినిమాలో నాని చూపించాడు. జెర్సీ కేవలం ఓ సినిమా కాదంటున్న వెంకటేశ్.. మనుషుల జీవితానికి కావాల్సిన ఎన్నో పాఠాల్ని ఇది నేర్పిస్తుందన్నారు.

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా స్టేజ్ పై నాని-వెంకటేష్ కాసేపు క్రికెట్ ఆడారు. వెంకీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకున్న ప్రేక్షకులకు జెర్సీ మూవీ టిక్కెట్స్ ఉచితంగా అందించారు.