హీరో 'తేజ సజ్జ' ఇంటర్వ్యూ

Monday,February 01,2021 - 05:10 by Z_CLU

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘జాంబి రెడ్డి’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు తేజ మాటల్లోనే !

 

అదొక్కటే కామన్ పాయింట్

టైటిల్ , కాన్సెప్ట్ చూసి కొందరు ప్రశాంత్ వర్మ హాలీవుడ్ సినిమాల నుండి ఆదర్శంగా సినిమా చేసాడని అనుకుంటున్నారు. నిజానికి ప్రశాంత్ అన్న ఏ సినిమా నుండి ఇన్స్ పెయిర్ అవ్వలేదు. జాంబి అనేది ఒక్కటే కామన్ పాయింట్ తప్ప సినిమా అంతా మన తెలుగు సినిమా స్టైల్ లో కామెడీతో ఉంటుంది. జాంబిలను సీమలో ఫ్యాక్షన్ వర్గాల మధ్య పెడితే అలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ప్రశాంత్ అన్న ఈ కథ రాసుకున్నాడు.

 

యాక్షన్… నేనొక్కడినే కాదు

సినిమాలో నేను యాక్షన్ చేస్తే చూడరు. దానికి ఇంకా టైం ఉంది. కానీ ఈ సినిమాలో నేను జాంబిలతో ఫైట్ చేస్తాను. చావు వరకు వస్తే ఎవ్వరైనా ఎదురెళ్ళి కొట్టాల్సిందే కదా స్క్రీన్ పై నా యాక్షన్ చూస్తే అలానే అనిపిస్తుంది తప్ప కమర్షియల్ కోసం హీరో ఫైట్ చేస్తున్నాడు అన్నట్టు ఉండదు. నాతో పాటు సినిమాలో ఉన్న అందరు హీరోయిన్స్ తో సహా ఫైట్ చేస్తారు.

 

హిలేరియస్ గా ఉంటుంది

జాంబి జానర్ లో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇందులో హిలేరియస్ ఫన్ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు థియేటర్స్ లో అందరు బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. జాంబిలు చేసే సీరియస్ పనులు కామెడీగా ఉంటాయి. కొన్ని కామెడీ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయని అనుకుంటున్నా.

 

సీక్వెల్ ఉంటుంది

జాంబి రెడ్డి కథతో పాటు దీనికి సీక్వెల్ కూడా ప్రశాంత్ అన్న రెడీ చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ కి ముందే ఆ సీక్వెల్ కథను సమంత గారికి నెరేట్ చేశాడు. ఈ సినిమాను జనాలు సూపర్ హిట్ చేస్తే కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది.

 

రెండు సినిమాలు

‘జాంబి రెడ్డి’ నాకు డెబ్యు సినిమా. ప్రస్తుతం రెండో సినిమాగా ‘ఇష్క్’ అనే మలయాళ సినిమా రీమేక్ లో నటిస్తున్నాను. అలాగే ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నాను. ఆ రెండు సినిమాలు కూడా నాకు హీరోగా మంచి గుర్తింపుతో పాటు సక్సెస్ అందిస్తాయని నమ్ముతున్నా.