కన్నడ హీరో మొదలు పెట్టాడు

Monday,July 20,2020 - 05:54 by Z_CLU

కరోనా ఎఫెక్ట్ తో అన్ని భాషల సినిమా షూటింగ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో హీరోలంతా ఇంటికే ఫిక్స్ అయ్యారు. ప్రభుత్వాలు షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినప్పటికీ పెద్ద సినిమాలు సెట్స్ పైకి రావడం లేదు. అయితే తాజాగా కన్నడ స్టార్ హీరో సుదీప్ తొలి అడుగు వేశాడు. తన సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

సుదీప్ అప్ కమింగ్ సినిమా ‘ఫాంటమ్’ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో సుదీప్ తో పాటు మరికొంత మంది ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు.

చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకున్న విషయాన్ని కిచ్చా సుదీప్ ఓ వీడియో ద్వారా తెలిపాడు. ఏదేమైనా కరోనా భయం లేకుండా హైదరాబాద్ వచ్చి మరీ కన్నడ హీరో షూటింగ్ చేస్తున్నాడంటే మెచ్చుకోవాల్సిందే.