గెట్ రెడీ: షాక్ ఇవ్వబోతున్న సిద్ధూ
Friday,February 15,2019 - 04:09 by Z_CLU
ఇండియన్-2 సినిమాకు సంబంధించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు మరో హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నాడు. అలా అని ఇది మల్టీస్టారర్ మూవీ కాదు. కమల్ హాసన్ హీరోగా, సిద్దార్థ్ విలన్ గా కనిపిస్తారట. ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న హాట్ హాట్ గాసిప్ ఇదే.
క్రేజ్ తగ్గి ఇబ్బందిపడుతున్న సిద్దార్థ్, మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్-2లో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడట. ఈ సినిమాలో సిద్ధూ కోసం ప్రత్యేకమైన మేకోవర్ సిద్ధంచేశారట. అలా స్పెషల్ గెటప్ తో ఇండియన్-2లో కనిపించబోతున్నాడు సిద్దార్థ్.
శంకర్ తీసిన బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన సిద్దార్థ్, ఇప్పుడు అదే శంకర్ తీస్తున్న ఇండియన్-2 సినిమాతో విలన్ గా కూడా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే సిద్ధూ ఎంట్రీపై, అతడి గెటప్ పై యూనిట్ ఓ క్లారిటీ ఇవ్వబోతోంది.