SatyaDev - రేంజ్, రెమ్యూనరేషన్ రెండూ పెరిగాయి

Monday,July 12,2021 - 01:13 by Z_CLU

సత్యదేవ్.. మొన్నటివరకు చిన్న హీరో. కానీ ఇప్పుడీ నటుడు ఆ రేంజ్ దాటేశాడు. మిడ్-రేంజ్ హీరోల మార్కెట్లోకి ఎంటరయ్యాడు. తన రేంజ్ పెంచుకున్నాడు. అదే టైమ్ లో రెమ్యూనరేషన్ కూడా పెంచాడు.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు అటుఇటుగా 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు సత్యదేవ్. అంత ఇవ్వడానికి మార్కెట్లో ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నప్పటికీ, సత్యదేవ్ దగ్గర కాల్షీట్లు లేవు. టాలీవుడ్ బిజీ హీరోల్లో సత్యదేవ్ కూడా ఒకడు.

gurthunda seethakalam satya dev tamanna

ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో 4 సినిమాలున్నాయి. సెట్స్ పై ఉంటుండగానే ఆ సినిమాల బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందంటే.. సత్యదేవ్ మార్కెట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు గుర్తుందా శీతాకాలం అనే సినిమానే తీసుకుందాం. ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. మూవీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. అంతలోనే సినిమా రైట్స్ అమ్ముడుపోయాయి.

Satyadev_Thimmarusu_First_look-zeecinemalu

గుర్తుందా శీతాకాలం కంటే ముందే థియేటర్లలోకి వస్తోంది తిమ్మరుసు. లాయర్ పాత్రలో సత్యదేవ్ నటించిన ఈ సినిమా ఈ హీరో కెరీర్ లోనే హయ్యస్ట్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోవడంతో పాటు నాన్-థియేట్రికల్ బిజినెస్ కింద కూడా క్రేజీ డీల్ లాక్ అయింది. ఈనెల 30న థియేటర్లలోకి వస్తున్నాడు తిమ్మరుసు.

skylab satyadev

ఇక సత్యదేవ్ నటిస్తున్న మరో మూవీ స్కైలాబ్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటుండగానే బిజినెస్ డీల్స్ లాక్ అయిపోతున్నాయి. ఈ సినిమాలన్నీ ఒకెత్తయితే, గాడ్సే మూవీ మరో ఎత్తు.

satyadev-godse-movie

విమర్శకుల ప్రశంసలతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్న బ్లఫ్ మాస్టర్ సినిమా కాంబినేషన్ గాడ్సేతో రిపీట్ అవుతోంది. అందుకే ఈ సినిమా ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేక్.

satyadev 25th movie koratala

ఈ సినిమాలతో పాటు తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రాన్ని కూడా ప్రకటించాడు సత్యదేవ్. ఈ మూవీకి స్టార్ డైరక్టర్ కొరటాల శివ ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఎన్నో విలక్షణ పాత్రలు, మంచి సినిమాలు చేసిన సత్యదేవ్.. తన 25వ సినిమాను గేమ్ ఛేంజర్ గా చెబుతున్నాడు.

ఓవైపు తెలుగులో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే.. బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు సత్యదేవ్. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న రామ్ సేతు సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆల్రెడీ షూట్ కూడా స్టార్ట్ చేశాడు.

satyadev zeecinemalu 2

ఇలా తన ప్రతి సినిమాతో సత్యదేవ్ తన రేంజ్, ఇమేజ్ పెంచుకుంటూనే ఉన్నాడు. పైన చెప్పుకున్న సినిమాలు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ హీరో మార్కెట్ మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే మిడ్-రేంజ్ హీరోల మార్కెట్లోకి ఎంటరైన సత్యదేవ్.. త్వరలోనే ఈ సెగ్మెంట్ లో మరింత ముందుకు దూసుకెళ్లబోతున్నాడు.