Santosh Sobhan - కుర్ర హీరో ఫుల్ బిజీ

Friday,July 02,2021 - 10:06 by Z_CLU

ప్రస్తుతం హీరోలందరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. కుర్ర హీరోలు కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇక కుర్ర హీరో సంతోష్ శోభన్ చేతిలో కూడా ఇప్పుడు నాలుగైదు సినిమాలున్నాయి. గోల్కొండ హై స్కూల్ తో నటుడిగా పరిచయమైన సంతోష్ శోభన్ హీరోగా ‘తను నేను’, ‘పేపర్ బాయ్’ సినిమాలు చేశాడు. కానీ అవి ఆశించిన ఫలితం అందుకోలేదు. దాంతో పేపర్ బాయ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు.

ఇక సంతోష్ తండ్రి శోభన్ మీద ఉన్న అభిమానంతో ప్రభాస్ సపోర్ట్ చేసి యూ.వీ సంస్థలో ‘ఏక్ మినీ కథ’ తీశారు. ఈ సినిమాతో హీరోగా మంచి మార్కులతో పాటు వరుస ఆఫర్లు అందుకున్నాడు సంతోష్. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదు కానీ OTT లో మాత్రం హిట్టైంది. ముఖ్యంగా సినిమాలో ఉన్న కామెడీ వర్కౌట్ అయ్యింది. అందుకే ఇప్పుడీ కుర్ర హీరోకి భారీ డిమాండ్ వచ్చింది.

ప్రస్తుతం సంతోష్ శోభన్ మారుతీ దర్శకత్వంలో ‘మంచి రోజులు వచ్చాయి’ అనే OTT ఫిలిం చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ నందిని రెడ్డి డైరెక్షన్ లో స్వప్న సినిమాస్ బేనర్ లో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు చిరంజీవి కూతురు పెట్టిన బేనర్ లో మరో సినిమా చేయడానికి అడ్వాన్స్ అందుకున్నాడు. ఇవే కాదు ఈ యంగ్ హీరో చేతిలో ఇంకా రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఉన్నపళంగా ఏక్ మినీ కథ సినిమాతో ఫామ్ లోకి వచ్చి వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు సంతోష్ శోభన్. మరి ఈ కుర్ర హీరో నెక్స్ట్ సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics