హీరో నితిన్ ఇంటర్వ్యూ

Wednesday,February 19,2020 - 06:10 by Z_CLU

గతేడాది నితిన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ఈ ఇయర్ మాత్రం నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ముందుగా ‘భీష్మ’తో థియేటర్స్ లోకి రాబోతున్న నితిన్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు నితిన్ మాటల్లోనే

పెళ్లి ఆలస్యమైంది

నిజానికి ఈ పాటికే పెళ్లి చేసుకోవాల్సింది కొంచెం ఆలస్యం అయింది. పెళ్ళనేది బిగ్ స్టెప్ కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. నాలుగైదేళ్ళు ఆలస్యమైంది.

ముందే అనుకున్నాం

శాలినీ నాకు ఫ్రెండ్ గా పరిచయమైంది. మెల్ల మెల్లగా ఇద్దరం క్లోజ్ అయ్యాం. ముందుగా నేనే ప్రపోజ్ చేసాను. ఆ తర్వాత చాలా త సీక్రెట్ గా కలిసే వాళ్ళం. ముందే ఎక్కడ లీక్ అవ్వకుండా ప్లాన్ చేసుకున్నాం. తనకి మీడియాలో రావడం అవన్నీ నచ్చాడు సో ఎవ్వరికీ దొరక్కుండా తిరిగేవాళ్ళం. లాస్ట్ ఇయర్ ఇంట్లో చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు. అలా పెళ్లి ఫిక్సయింది

దుబాయ్ లో పెళ్లి

ఏప్రిల్ 15న ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఏప్రిల్ 16న దుబాయ్ లో పెళ్లి చేసుకోబోతున్నాను. హైదరాబాద్ కి తిరిగొచ్చాక ఏప్రిల్ 21న హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుంది.

ఏడాది టైం తీసుకోమన్నాను

‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ టైం లో వెంకీ అరగంట స్టోరీ వినిపించాడు. కానీ ఒక ఏడాది టైం తీసుకొని ప్రాపర్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాను. కొంచెం ఎక్కువ టైం తీసుకొని మళ్ళీ పూర్తి స్క్రిప్ట్ తీసుకొని కలిసాడు. సో వెంటనే సెట్స్ పైకి వెళ్ళిపోదామని ఫిక్సయ్యాం.

గ్యాప్ లో మూడు సినిమాలు

భీష్మ స్క్రిప్ట్ ఫినిష్ అయ్యే గ్యాప్ లో ‘రంగ్ దే’ స్క్రిప్ట్, చంద్రశేఖర్ యేలేటి సినిమా స్క్రిప్ట్ కూడా విని ఓకే చేశాను. వాటి పూర్తి స్క్రిప్టులు అయ్యాకే మూడింటినీ మొదలుపెట్టాను. అలాగే కృష్ణచైతన్య చెప్పిన ‘పవర్ పేట’ స్క్రిప్ట్, హిందీ సినిమా ‘అంధాధున్’ రీమేక్ కూడా ఓకే ఛేశాను. ఈ ఏడాది బహుశా నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి.

అందుకే ఎలివేట్ చెయ్యలేదు

‘దిల్’ తర్వాత నేను చేసిన లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్. యాక్షన్ కూడా మిళితమై ఉంటుంది. ఇందులో ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రధానాంశం కాదు.అది కథలో ఒక ఎలిమెంట్ మాత్రమే. భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీ ఉంటుంది. అందులో నేనొక ఉద్యోగిని. ఆర్గానికి ఫార్మింగ్ అంటే దాని గురించిన సినిమా అని అంటారేమోనని దాన్ని ప్రమోషన్స్‌లో ఎలివేట్ చెయ్యలేదు.

హైలైట్ అవుతుంది

‘అతడు’లోని పొలం ఫైట్ ను దృష్టిలో ఉంచుకొనే దాన్ని తీశాం. అది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఆ ఫైట్ సినిమాకు హైలైట్ అవుతుంది.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగోట్టేసాడు

మహతి స్వరసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘వాటే బ్యూటీ’ కానీ, ‘సరాసరి గుండెల్లో’ కానీ, సింగిల్స్ యాంథెం కానీ.. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడు.

మార్చమని చెప్పాను 

అంతా ‘ఛలో’ టీం అయిపోతోందని, మహతినైనా మార్చమని వెంకీకి చెప్పా. మహతితో తనకు బాగా సింకవుతుందనీ, అతడితోనే మ్యూజిక్ చేయిద్దామనీ వెంకీ అనడంతో సరేనన్నా. మహతి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి వెంకీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.

కచ్చితంగా ఇష్టపడతారు

చివరిగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఎక్కువ డాన్స్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ డాన్స్ చెయ్యలేదు. ఈ సినిమాకు ముందే అనుకొని డాన్స్ చేసాం. తెరమీద నా డాన్స్ చూసినవాళ్లు కచ్చితంగా ఇష్టపడతారు.

కెమిస్ట్రీ బాగుందంటున్నారు

తెరపై రష్మిక అద్భుతంగా ఉంది. చక్కని నటి. మా మధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు.

మరో సినిమా చేయబోతున్నా

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నానంటేనే ఈ బ్యానర్ అంటే ఎంత ఇష్టపడుతున్నానో మీరే ఊహించుకోండి. వీళ్లు తీసే అన్ని సినిమాల్లో నిర్మాణ విలువలు హై లెవల్లో ఉంటాయి. ‘అ ఆ’ మూవీ నుంచి ఈ బ్యానర్ తో నా జర్నీ మొదలైంది. ‘భీష్మ’ తర్వాత మళ్లీ ఇదే బ్యానర్ తో ‘రంగ్ దే’ చేస్తున్నా. దాని తర్వాత కూడా మరో సినిమా చేద్దామని నిర్మాత నాగవంశీ అంటున్నారు.

 

టైటిల్ ఫిక్స్ చేశాం

చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్ లో నేను నటిస్తున్న సినిమాకు ‘చెక్’ అనే టైటిల్ ను ఖరారు చేశాం. త్వరలోనే ఆ టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నాం.

 

నెక్స్ట్ అవే

నెక్స్ట్ మేర్లపాక గాంధీతో ‘అంధాదున్’ రీమేక్ , కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ‘పవర్ పేట’ సినిమా చేయబోతున్నాను. ఆ రెండు సినిమలు పెళ్ళయ్యాక సమ్మర్ నుండి స్టార్ట్ చేస్తాను.