బరువు తగ్గనున్న హీరో నిఖిల్

Thursday,November 02,2017 - 04:02 by Z_CLU

కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీ మూవీ రీమేక్ లో బిజీగా ఉన్న హీరో నిఖిల్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నాడు. నిన్నటివరకు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, 20 రోజుల గ్యాప్ తరవాత ఫైనల్ షెడ్యూల్ తో మళ్ళీ సెట్స్ పైకి రానుంది.

శరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు నిఖిల్. అందుకే ఈ 20 రోజుల గ్యాప్ లో బరువు తగ్గించుకుని సినిమాలోని మరో ఎట్రాక్టివ్ లుక్ కోసం మేకోవర్ పనిలో పడ్డాడు నిఖిల్. ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.