Hero Nikhil - బ్రేకప్ లాంటి ఉద్దేశాలు నాకు లేవు

Saturday,February 05,2022 - 01:56 by Z_CLU

Hero Nikhil Talks about Malli Modalaindi Movie and Breakups

బ్రేకప్స్ పై స్పందించాడు హీరో నిఖిల్. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ లో హ్యాపీగా ఉన్నానని, బ్రేకప్స్ లాంటి గురించి మాట్లాడకూడదని అంటున్నాడు. మళ్లీ మొదలైంది సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన నిఖిల్.. ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందంటున్నాడు.

“మొన్ననే నాకు పెళ్లయింది. అప్పుడే మళ్లీ మొదలైందంటే కష్టం. బ్రేకప్ లాంటి ఉద్దేశాలు లేవు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా గ్యాంగ్ మొత్తానికి నా గురించి తెలుసు. నేను చాలా హ్యాపీ. ఇక సినిమా విషయానికొస్తే.. మళ్లీ మొదలైంది సినిమా కథ నాకు ముందే తెలుసు. దర్శకుడు కీర్తి నాకు ముందే చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నిర్మాత రాజన్న మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. అలాంటి నిర్మాతలు మరింతమంది రావాలి. రాజన్న బ్యాక్ స్టోరీ గురించి చెప్పాలంటే మరో సినిమా తీయాలి. ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. ఫిబ్రవరి 11న జీ5లో ఈ సినిమా వస్తోంది. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.”