పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో కిరాక్ పార్టీ

Friday,February 09,2018 - 01:21 by Z_CLU

లెక్కప్రకారం ఈరోజు రిలీజవ్వాలి కిరాక్ పార్టీ సినిమా. కొన్ని రోజుల కిందటి వరకు ఇదే రోజున రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ అనుకున్న టైమ్ కు సినిమా రెడీ కాలేదు. రిలీజ్ డేట్ పై ఎన్నో ఊహాగానాలు చెలరేగాయి. దీంతో సినిమా విడుదల తేదీపై హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యాడు.

సినిమాకు సంబంధించి చాలా వర్క్ పెండింగ్ లో ఉందని ప్రకటించిన నిఖిల్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని ట్వీట్ చేశాడు. మంచి ఔట్ పుట్ కోసం పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ లో కొత్త టెక్నిక్స్ ఫాలో అవుతున్నామని, ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత నిర్మాత రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలిపాడు నిఖిల్.

మూవీ అప్ డేట్స్ ఇచ్చిన నిఖిల్, రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే కిరాక్ పార్టీ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, టెక్నికల్ గా కూడా రిచ్ గా ఉంటుందని నిఖిల్ ట్వీట్ తో అర్థమౌతోంది.

శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరిన్జా హీరోయిన్లుగా పరిచయమౌతున్నారు. AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.