Nikhil - నిఖిల్ నుంచి యాక్షన్ స్పై థ్రిల్లర్

Saturday,October 09,2021 - 07:24 by Z_CLU

Hero Nikhil, Director Garry BH Action Spy Film Launched

యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రాన్ని గ్యారీ బీహెచ్ డైరక్ట్ చేయబోతున్నాడు. ఇంతకుముందు గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఇతడు ఎడిటర్ గా పని చేశాడు. రెడ్ సినిమాస్ ప‌తాకంపై కె.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది.

ప్ర‌ముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. ముహుర్తం షాట్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు.

nikhil director garry new movie 2

నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఫిక్స్ కాలేదు. విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోన్న నిఖిల్ మొదటిసారిగా గూఢచారి (స్పై) పాత్రలో నటిస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాడు.

ఓపెనింగ్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. డైరెక్టర్ గ్యారీ బీహెచ్ స్వతహాగా ఎడిటర్‌ కావడంతో ఈ సినిమాకు కూడా ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నారు. మనోజ్ రెడ్డి కెమెరామెన్‌గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics