Hero Nani - స్పీడు మాములుగా లేదు

Sunday,January 30,2022 - 05:09 by Z_CLU

Hero Nani is coming with back to back movies

యంగ్ హీరోల్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని. నెలల గ్యాప్ లోనే సినిమలు రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నాడు. లాక్ డౌన్ టైంలో కూడా నాని నుండి రెండు సినిమాలు OTT లో రిలీజ్ అయ్యాయి. తాజాగా ‘శ్యామ్ సింగ రాయ్’తో మళ్ళీ థియేటర్స్ లో హంగామా చేశాడు. ఆ సినిమా విడుదలై నెల కాకముందే ‘అంటే సుందరానికి’ అనే సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు.

వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చ్ లేదా ఏప్రిల్ లో ఈ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నాని ఇయర్ ఎండింగ్ లో ‘దసరా’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కనుంది.

ఇలా నెలల గ్యాప్ లోనే సినిమాలు రెడీ చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని మెప్పిస్తూ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నాడు నేచురాల్ స్టార్. త్వరలోనే లైనప్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు.