Nani అందులో నిజం లేదు.. అవన్నీ రూమర్లే

Monday,June 06,2022 - 03:24 by Z_CLU

Hero Nani Gives a clarity on that rumors

ఫలానా సినిమలో ఆ హీరో కూడా నటిస్తున్నాడట, ఆ స్టార్ హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ ? ఇలాంటి వార్తలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే మొన్నీ మధ్య హీరో నాని గురించి కూడా ఇలాగే రెండు వార్తలు వినిపించాయి. విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న సినిమాలో నాని స్పెషల్ రోల్ అనేది అందులో ఒక వార్త కాగా మరొకటి మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో నాని ఓ కేరెక్టర్ ప్లే చేయబోతున్నాడనేది ఇంకో వార్త. ఈ రెండు వార్తలు సోషల్ మీడియాలో పుట్టినవే.

తాజాగా ఇంటర్వ్యూలో ఈ బడా సినిమాలపై క్లారిటీ ఇచ్చేశాడు నాని. ఆ సినిమాల్లో తను నటించడం లేదని అవన్నీ రూమర్లే అంటూ కొట్టి పారేశాడు. తనకి కూడా సోషల్ మీడియా ద్వారానే ఈ వార్తలు కనిపించాయని చెప్పుకున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే తన సినిమా ఎనౌన్స్ చేసినా రూమర్ అనుకుంటారేమో అంటూ జోకేశాడు. తాజాగా ‘అంటే సుందరానికీ’ మీడియా మీట్ లో నాని ఆ కేరెక్టర్స్ పై ఇలా తన దైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చాడు.

నాని ఇచ్చిన ఈ క్లారిటీ తో ఈ రూమర్లకు చెక్ పడింది. ఇక నాని 30 ఎవరితో అనేది ఇప్పుడే చెప్పలేనని ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ దసరా మీదే ఉందని అదొక మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు నాని.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics