హీరో నాగశౌర్య ఇంటర్వ్యూ

Tuesday,January 28,2020 - 02:39 by Z_CLU

నిన్నా మొన్నటివరకు లవర్ బాయ్.. రీసెంట్ గా కామెడీ డోస్ ఉన్న సినిమాతో కూడా తనలోని వేరియేషన్ ని చూపించే ప్రయత్నం చేశాడు నాగశౌర్య. అంతటితో ఆగకుండా రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఓ కథ రాసుకుని అశ్వత్థామగా తనలోని యాక్షన్ యాంగిల్ ని చూపించబోతున్నాడు నాగశౌర్య. ఈ కథ అసలెలా పుట్టింది..? ఆ కథ వెనక ఉన్న కథ ఏంటి..? లాంటి క్వశ్చన్స్ కి మీడియా ఇంటరాక్షన్ లో జెన్యూన్ గా సమాధానాలు చెప్పాడు నాగశౌర్య.

అదీ అశ్వత్థామ…

సినిమాని.. ఈ కథని ఎంతగా నమ్మానంటే రిలీజ్ కి ముందే టైటిల్ ని ట్యాటూగా వేసుకున్నా. ఈ కథ రాసుకునే ప్రాసెస్ లో జీవితమంటే ఏంటో తెలుసుకున్నా…

ఆ సమస్య నాకు రాలేదు…

కథ రాసుకుంటున్నప్పుడు ఒక్క నా క్యారెక్టర్ పైనే ఫోకస్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ విషయంలో కూడా అంతే ఫోకస్డ్ గా ఉన్నా. సినిమాలో ఒక్క హీరో క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే సరిపోదు. విలన్ కూడా అన్తెహ్ స్ట్రాంగ్ గా ఉండాలి. కథ ముందుకు నడవాలంటే ప్రతి క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండాల్సిందే.

మోసం చేసిన వాణ్ణి అవుతా…

ఎక్కడా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించాం. అయినా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళంతా యంగ్ టీమ్. నిజానికి మేం పెట్టిన బడ్జెట్ కి సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్ ని తీసుకోవచ్చు. కానీ ఒకప్పుడు నేను ఫ్రెషర్ గా ఉన్నప్పుడు శ్రీనివాస్ అవసరాల గారు, సాయి కొర్రపాటి గారు నన్ను ఎంకరేజ్ చేసి ఉండకపోతే ఈ రోజు నేనీ స్థాయిలో ఉండగలిగే వాణ్ణి కాదు. అందుకే ఈ రోజు నా కంటి ముందు టాలెంట్ కనిపిస్తున్నా ఎంకరేజ్ చేయకపోతే నన్ను నేను మోసం చేసుకున్న వాణ్ణి అవుతా…

మీరు కూడా నమ్మలేరు…

సినిమాలో ఒక ఆమ్మాయికి జరిగిన అన్యాయం మీరు సినిమాలో చూసినా నమ్మలేరు. కానీ అక్షరాలా జరిగిన వాస్తవం. ఆ ఇన్సిడెంట్ నన్నీ కథ రాసేలా మోటివేట్ చేసింది.

ఆ అమ్మాయి అన్న మాట అదీ…

కథ రాసుకునే ముందు నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఆ టైమ్ లో ఆ అమ్మాయి అన్న మాట ఒక్కటే. ‘తనకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి…’ ఆ మాట నన్ను చాలా కదిలించేసింది.

చేదు అనుభవాలు…

ఈ స్టోరీ రాసే ప్రాసెస్ లో చాలా చోట్ల తిరిగాను. సంగారెడ్డి, పంజాబ్, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ…. కానీ ఎవరూ కనీసం ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు.

నర్తనశాల ఫ్లాప్ ఇంపాక్ట్…

మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎలా ఉంటుందో.. అలా 6 నెలలపాటు అంతగా బాధపడ్డాం ఆ సినిమా రిజల్ట్ తో. నేను మా అమ్మా నాన్న పరువు, డబ్బు పోగొట్టేశాననిపించింది. వాళ్ళు నాకోసం ఈ ఇండస్ట్రీకి వచ్చారు. నా వల్ల ఫ్లాప్ వచ్చిందని కనీసం నన్ను బ్లేమ్ చేయకపోవడం నన్ను ఇంకా బాధపెట్టింది. ఇంకోసారి అలాంటి తప్పు జరగదు.

నేను మోసం చేయలేను…

‘నర్తనశాల’ సినిమా ప్రమోషన్ టైమ్ లోనే సినిమా నచ్చితే చూడండి. నచ్చకపోతే ముగ్గురికి చెప్పండి అని చెప్పాను. అంతేకానీ సినిమా అందరికీ నచ్చుతుందని అబద్ధం చెప్పలేదు. ఆ సినిమా ఆడదని ముందే గెస్ చేశా. దర్శకుడికి మాట ఇచ్చా కాబట్టే.. ఆ మాట కోసం ఆ సినిమా చేశా. మహా అయితే డబ్బులు పోయాయి కానీ మాట మీద నిలబడ్డా అది చాలు…

నాకు ఆ ఇమేజ్ వద్దు…

నాకు లవర్ బాయ్ ఇమేజ్ వద్దు.. ఒక నటుడిగా అన్ని రకాలా క్యారెక్టర్స్ ప్లే చేయాలని ఉంది. లవ్ స్టోరీ చేస్తే ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి డిఫెరెంట్ సినిమా చేస్తా…

అశ్వత్థామ అనే టైటిల్…

మహా భారతంలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన వ్యక్తి అశ్వత్థామా. అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా అలాంటిదే కాబట్టి ఈ టైటిల్ పెట్టడం జరిగింది.

పవన్ కళ్యాణ్ డైలాగ్…

‘గోపాల గోపాల’ సినిమాలో అశ్వత్థామ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగ్, ఈ అశ్వత్థామకి ఇన్స్ పిరేషన్. అందుకే శరత్ మరార్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ డైలాగ్ ని సినిమాలో పెట్టడం జరిగింది.

అవసరాలతో సినిమా…

ఇప్పటికే 3 షెడ్యూల్స్ అయిపోయాయి. ఇంకా 4 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ ప్రమోషన్స్ తరవాత మళ్ళీ షూటింగ్ బిగిన్ చేస్తాం.

నందిని రెడ్డితో సినిమా…

ఆవిడ కొన్ని కథలు చెప్పారు. ప్రస్తుతం రైటింగ్ స్టేజ్ లో ఉన్నాయి.

‘ఐరా’లో స్టార్ హీరో…

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వేరే హీరో సినిమా ఉంటుంది. దానికోసం ఓ లవ్ స్టోరీ రెడీ చేస్తున్నా. ఈ సినిమా సక్సెస్ అయితే హీరోని అప్రోచ్ అవుతా.

గాయాలు తప్పలేదు…

‘KGF’ సినిమాకి పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకి పని చేశారు. ఆ ప్రాసెస్ లో చాలా సార్లు గాయాలయ్యాయి.

అశ్వత్థామ విలన్…

విలన్ ని రిలీజ్ కి ముందే చూపించకూడదు అని బిగినింగ్ నుండే అనుకున్నాం. మీరు సినిమాలో చూసి సర్ ప్రైజ్ అవుతారు. ఆయనకిది 99 వ సినిమా. అద్భుతంగా నటించారు.