Varudu Kaavalenu Event నాగ శౌర్య స్పీచ్

Thursday,October 28,2021 - 04:57 by Z_CLU

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా తెరకెక్కిన ‘వరుడు కావలెను‘ రేపే గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు హీరో నాగ శౌర్య.

నాగశౌర్య మాట్లాడుతూ…”ఏడాదిన్నర నిరీక్షణకు మంచి దారి దొరికింది. సినిమా పక్కా హిట్‌. ఇది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కాదు. మా అందరికీ ఉన్న నమ్మకం. 29న మా అక్క సౌజన్య లైఫ్‌ డిసైడ్‌ కాబోతుంది. తను దర్శకురాలిగా సెట్‌ అయిపోయినట్లే. తను అనుకున్నది అనుకున్నట్లు తీసింది. డెఫినెట్‌గా తను అనుకున్న జీవితాన్ని పొందుతుంది.మా అక్క సక్సెస్‌కి మేమంతా ఉన్నాం. మురళీశర్మగారి క్యారెక్టర్‌ నన్ను కదిలించింది. చినబాబుగారి సహనానికి గ్రేట్‌. తగ్గేదేలే అన్నట్లు బడ్జెట్‌ పెట్టారు. బన్నీ అన్న నాకు స్ఫూర్తి’’ అన్నారు.


– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics