Maanaadu Remake చైతు క్లారిటీ !

Tuesday,July 19,2022 - 01:41 by Z_CLU

Hero Naga Chaitanya gives a clarity on Maanaadu Remake in Telugu

గతేడాది కోలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ‘మానాడు’ ఒకటి. ఈ సినిమా అక్కడ పెద్ద హిట్టవ్వడంతో తెలుగు నుండి చాలా మంది రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డారు. అయితే ఫైనల్ గా సురేష్ బాబు రైట్స్ దక్కించుకున్నారు. అప్పటి నుండి ఈ సినిమా తెలుగులో ఎవరు చేస్తారనే టాపిక్ నడిచింది. ఫైనల్ గా ఇప్పుడు ఈ రీమేక్ రానా చేతికి చిక్కింది. ఈ విషయాన్నీ నాగ చైతన్య అఫీషియల్ చెప్పాడు. ‘థాంక్యూ’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న చైతుకి ‘మానాడు’ రీమేక్ ఏమైంది ? మీరు చేయడం లేదా ? అనే ప్రశ్న ఎదురైంది.

దానికి చైతు సమాధానం చెప్తూ ” మానాడు సినిమా చూశాను బాగా నచ్చింది.రైట్స్ కోసం ట్రై చేశాను. హిందీ డబ్బింగ్ అమ్మలేమని , ఏవేవో డిస్కషన్స్ జరిగాయి. సో అప్పుడు వదిలేశాను. వెంకట్ ప్రభు నేనూ మానాడు కంటే ముందు నుండే ట్రావెల్ అవుతూ ఉన్నాం. దానికి ముందు చెప్పిన కథతోనే ఇప్పుడు ఇద్దరం సినిమా చేస్తున్నాం. సో రైట్స్ కి ట్రై చేశాను సక్సీడ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ సినిమాను రానా చేస్తున్నాడు.” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక పరశురాంతో తను చేయబోయే సినిమాకు కథ సిద్దంగా లేదని జస్ట్ ఐడియా మాత్రమే ఉందని, ఈ మధ్యే పరశురాంని కలిశానని పది పదిహేను రోజుల్లో స్టోరీతో మళ్ళీ వస్తా అని అన్నారు. అలాగే తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ స్క్రిప్ట్ కూడా ఐడియా లెవెల్ లోనే ఉందని తన అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు నాగ చైతన్య.

 * Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics