Interview - కార్తికేయ (రాజా విక్రమార్క)

Tuesday,November 09,2021 - 01:15 by Z_CLU

కొత్త దర్శకుడు  శ్రీ సరిపల్లి డైరెక్షన్ లో హీరో కార్తికేయ NIA ఏజెంట్ గా నటించిన ‘రాజా విక్రమార్క‘ నవంబర్ 12న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు కార్తికేయ. ఆ విశేషాలు తన మాటల్లోనే…

కొత్తగా అనిపించింది

ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో NIA ఏజెంట్ గా నటించాను. నా కామెడీ టైమింగ్ , లుక్ అన్నీ కొత్తగానే ఉంటాయి. స్టైలిష్ యాక్షన్ , కామెడీ టైమింగ్ తో ఇప్పటి వరకూ నేను టచ్ చేయని జానర్ కాబట్టి చాలా కొత్తగా అనిపించింది.

సినిమాటిక్ వరల్డ్ లోకి తీసుకెళ్ళే ప్రయత్నం

ఒక హానెస్ట్ ఎటెంప్ట్ తో చేసిన సినిమా ఇది. సినిమాటిక్ వరల్డ్ లోకి తీసుకెళ్ళి ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మా డైరెక్టర్ ఈ కథను ఎంచుకున్నాడు. సినిమా కథ బయటికి వెళ్ళకుండా ప్రతీ సెకండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఎగ్జైట్ మెంట్ కలిగిస్తూ ఎంటర్టైన్ మెంట్ కూడా ఉంటుంది. ఏదీ ఫోర్స్ గా పెట్టినట్టు అనిపించదు.

Kartikeya Tanya Ravichandran raja vikramarka movie

100 % బోర్ కొట్టదు

సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఎక్కడా బోర్ కొట్టదు. అది మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఈ స్క్రిప్ట్ నరేట్ చేసిన వెంటనే డైరెక్టర్ శ్రీ మీద చాలా నమ్మకం వచ్చింది. కాకపోతే సినిమా చూస్తే తప్ప జడ్జ్ చేయలేం అలాంటి స్క్రిప్ట్ ఇది. కానీ ఆ నమ్మకం తను నిలబెట్టుకున్నాడు.

అందరూ ఇంపార్టెంట్

సినిమాలో యాక్ట్ చేసిన అందరూ యాక్టర్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తూనే ఉంటారు. రిలీజ్ తర్వాత అన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. ముఖ్యంగా తనికెళ్ళ భరణి గారి క్యారెక్టర్ , హర్ష వర్ధన్ క్యారెక్టర్స్ లో మంచి ఫన్ ఉంటుంది. థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు.

మెగాస్టార్ అలా అన్నారు

సినిమా టైటిల్ పెట్టే ముందు చిరంజీవి గారికి తెలియదు.  టైటిల్ దొరికి ఫిక్స్ చేశాక ఆయనకి మెస్సేజ్ లో చెప్పాను. గుడ్ లక్ అని రిప్లై ఇచ్చారు. ఒక అభిమానిగా ఆయన టైటిల్ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సినిమాతో దీనికి ఏ మాత్రం పోలిక ఉండదు. మా కథకి యాప్ట్ అనిపించి పెట్టుకున్నాం.

అవన్నీ హైలైట్స్ 

సినిమాలో స్టైలిష్ మేకింగ్ , మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ హైలైట్ అనిపిస్తాయి. స్టోరీ -స్క్రీన్ ప్లే కూడా మెస్మరైజ్ చేస్తాయి. సీరియస్ గా సాగుతూనే మంచి ఎంటర్టైన్ మెంట్ కూడా ఉంటుంది. ఫైనల్ గా ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది.

– ‘రాజా విక్రమార్క’ ట్రైలర్ రివ్యూ

ఇప్పుడు చెప్పలేను

తమిళ్ లో అజిత్ గారి ‘వాలిమై’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాను. ఆయనతో బైక్ రేస్ లు గట్రా చేశాను. ఆయనతో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్. నేను సినిమా ఒప్పుకున్నప్పుడు తెలుగులోనే కూడా ఒకే సారి రిలీజ్ అని చెప్పారు. కానీ తెలుగులో సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ అదే టైంలో రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది చెప్పలేను. రిలీజైతే హ్యాపీ.

గర్వంగా ఫీలవుతున్నా

ఆర్ ఎక్స్ 100 హిందీ లో రీమేక్ అవుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. నేను ఎప్పుడో ఒక కాఫీ షాపులో విని ఒకే చేసిన స్క్రిప్ట్ అది. రీసెంట్ గా ట్రైలర్ చూశాను. చాలా గ్రాండియర్ గా తీశారనిపించింది. హిట్టయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ.

పెళ్లి హైదరాబాద్ లోనే…

ఈ నెల 21న పెళ్లి చేసుకోబోతున్నాను. ఒక వైపు నా సినిమా రిలీజ్ ప్రమోషన్స్ అటు వైపు పెళ్లి ఏర్పాట్లతో ఫుల్ బిజీ అయిపోయాను. పెళ్లి హైదరాబాద్ లోనే జరగనుంది. అందరి సమక్షంలో గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటున్నాను.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics