కళ్యాణ్ రామ్ కొత్త ఫార్ములా

Thursday,June 14,2018 - 10:03 by Z_CLU

కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ ఈ రోజే గ్రాండ్ గా రిలీజయింది. కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఫుల్ ఫ్లెజ్డ్ రొమాంటిక్ హీరోగా నటించాడు కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో. అయితే ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ లో ఉండాలని ఫిక్సయిన ఈ హీరో ఇప్పటికే 2 సినిమాలు లైనప్ చేసుకున్నాడు.

K.V. గుహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ జూలై 18 కల్లా 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. మరోవైపు ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకుడు పవన్ సాదినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ హీరో, సొంత బ్యానర్ లో భారీ మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న సినిమాలో తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోనున్న స్టార్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాడు కళ్యాణ్ రామ్. మ్యాగ్జిమం గుహన్ సినిమాకి ప్యాకప్ చెప్పే లోపు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు కళ్యాణ్ రామ్.