మంచి కంటెంట్ ఇస్తే ఆడియన్స్ సినిమా చూస్తారు - కళ్యాణ్ రామ్

Monday,August 08,2022 - 04:04 by Z_CLU

Hero Kalyan Ram Speech at Bimbisara Success Pressmeet

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వసిష్ఠ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై హరి నిర్మాణంలో తెరకెక్కిన ‘బింబిసార’ ఇటివలే రిలీజై భారీ సక్సెస్ అందుకుంది. సెంటిమెంట్ యాక్షన్ డ్రామాతో ఫాంటసీ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమా  మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటూ ముందు కెళుతోంది. రిలీజైన మూడో రోజుకే తెలుగు రాష్ట్రాల్లో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరయింది. ఈ సందర్భంగా టీం డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ” మా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబ్యూటర్స్ అందరూ మేం రికవరీ అయిపోయాం చాలా హ్యాపీ గా ఉన్నాం అంటూ చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. 2020 మార్చ్ 10న ఈ సినిమా ప్రారంభించాం. షూటింగ్ స్టార్ట్ చేసిన ఐదో రోజు లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపాల్సి వచ్చింది.  మూడు నెలల తర్వాత టెన్షన్ పడుతూ షూటింగ్ మొదలు పెట్టాం. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది లాక్ డౌన్ అన్నారు. ఆ టైంలో బాగా టెన్షన్ పడిపోయాను. నాకు కొత్త జానర్ ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నాను. గ్రాండియర్ విజువల్స్ మీద డిపెండయిన పెద్ద సినిమా ఎలా జరుగుతుందో అని ఖంగారు పడ్డాను. తర్వాత లాక్ డౌన్ తీసేశారు. మెల్లగా అన్నీ ఓపెన్ అయ్యాయి. మా షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాం. అనుకున్న విధంగా కంప్లీట్ చేశాం. సినిమాను రిలీజ్ కి రెడీ అయ్యాక పబ్లిక్ థియేటర్స్ కి రావడం లేదని అన్నారు. మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఒక భయంలో ఉండిపోయాం. రెండున్నర సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టి, ఎక్కువ బడ్జెట్ పెట్టి  ఓ గ్రాండియర్ సినిమా చేశాం ఏమవుతుందో అనుకున్నాను. కానీ నాకు లోలోపల నమ్మకం ఉంది ఒక మంచి సినిమా తీసి జనాలకి అందిస్తే వాళ్ళు బ్రహ్మరథం పడతారని. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ నుండి  వచ్చిన రెస్పాన్స్ మాములుగా లేదు. మా నందమూరి వీరాభిమనులందరికీ థాంక్స్ అండి. అలాగే సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ కి ముందుగా కీరవాణి గారికి ఈ సినిమాకు ఆయన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. కెమెరా మెన్ చోటా గారికి మిగతా అందరికీ థాంక్యూ సో మచ్ అండి. నాకు రీ బర్త్ ఇచ్చిన సినిమా ‘బింబిసార’. ఇంత గొప్ప కథ అందించిన మా డైరెక్టర్ వసిష్ఠ కి అలాగే సినిమా చూసి రిలీజ్ చేసిన రాజు గారికి , శిరీష్ గారికి థాంక్యూ. థాంక్స్ తప్పించి నేను ఏమి చేయలేను కానీ ఒకటి చేయగలను నేను తీసే ప్రతీ సినిమా కొత్తదనంగా ఉండేలా చూసుకుంటూ ప్రేక్షకులందరినీ అలరించే మంచి కంటెంట్ ఇవ్వగలను.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics