Interview కళ్యాణ్ రామ్ (బింబిసార)

Wednesday,August 03,2022 - 05:11 by Z_CLU

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. టైం ట్రావెల్ కథతో సోషియో ఫాంటసీ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 5న గ్రాంగ్ గా రిలీజవుతున్న  సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు హీరో కళ్యాణ్ రామ్ మాటల్లోనే…

నో లాజిక్స్.. ఓన్లీ మేజిక్ అన్నాడు 

2018 డిసెంబర్ లో వసిష్ఠ నాకు ఫోన్ చేసి ఓ కథ ఉంది వినండని అడిగాడు. సరిగ్గా ఆ టైంలో మహానాయకుడు షూటింగ్ లో ఉన్నాను అయ్యాక వింటాను అని చెప్పాను. తను ఈ కథ చెప్పే ముందే ఇందులో లాజిక్స్ వెతక్కండి ఓన్లీ  మేజిక్ ఉంటుంది అన్నాడు. అప్పటికే వసిష్ఠ నాకు బాగా తెలుసు. అప్పుడప్పుడు కథలు చెప్పే వాడు. టైం ట్రావెల్ , ఫాంటసీ ఎలిమెంట్స్ తో స్క్రిప్ట్  వినగానే నచ్చేసింది. కొత్తగా ఉందనిపించింది. ఇలాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందనిపించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఎలా ఉండాలి , గెటప్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేసుకుంటూ బింబిసార టైటిల్ అనుకున్నాం.

వాళ్లకి టైం ఇవ్వగలగాలి

కథ బాగుంటే కొత్తా పాతా అనేది చూడకుండా జనాలు సినిమా చూస్తారు. అతనొక్కడే సినిమా చేసే ముందు సురేందర్ రెడ్డి కూడా కొత్త వాడేకానీ అతని స్క్రీన్ ప్లే , టేకింగ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు వసిష్ఠ కూడా అంతే. అందరూ మొదటి సినిమా నుండే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతారు. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తే కొత్త కథలతో మంచి సినిమాలు వస్తాయని నమ్ముతాను. కానీ వాళ్లకి టైం ఇస్తూ మనం బెస్ట్ తీసుకోగలగాలి అంతే.

బింబిసార లుక్ … స్పెషల్ కేర్ తీసుకున్నాం 

ఈ సినిమా ద్వారా ఒక కొత్త కేరెక్టర్ చేయగలిగాను. నాలో ఉండే అగ్రెస్సివ్ నెస్ ని ఈ పాత్ర ద్వారా ఎక్స్ ప్లోడ్ చేశాను. ఆ ప్రాసెస్ ని బాగా ఎంజాయ్ చేశాను ట్వెంటస్టిక్. కాకపోతే రాజుగా కనిపించాలి అన్నప్పుడు నాకూ డౌట్స్ ఉన్నాయి. అద్బుతమైన కథ వచ్చేసింది కానీ రాజుగా నేను సెట్ అవుతానా ? అనే డౌట్ ఉండేది. నేనెప్పుడు చేయలేదు కానీ కొన్ని రిఫరెన్స్ లు ఉన్నాయి మనకి . ముఖ్యంగా ప్రభాస్ ఒక మార్క్ క్రియేట్ చేసి రాజు అంటే ఇలా ఉండాలి అనే స్టాండ్ పెట్టేశాడు. సో నేను కూడా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని లుక్స్ తో రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. నా హైట్ కి తగ్గట్టే వెయిట్ బాగా తగ్గించేసి వర్కౌట్స్ చేశాను. అలా స్పెషల్ కేర్ తీసుకొని ఫైనల్ గా ఈ గెటప్ ఫిక్స్ అయ్యాం.

బింబిసారుడి కథ మాత్రమే 

ఒక రాజు కథ అంటే యుద్దాలతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ చేస్తారు కానీ ఇందులో అలాంటివి డిజైన్ చేయలేదు. సినిమాలో  బింబిసారుడి కథ మాత్రమే చూపించాం. కాకపోతే విటలాచార్య గారి సినిమాలో కనిపించే దెయ్యాలు , భూతాలు వంటి  కొన్ని  ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి.

 తెలుగు మీదే ఫోకస్ ..కారణం అదే 

 నేను బేసిక్ గా తెలుగు యాక్టర్ ని. నాకున్న బడ్జెట్ కి రేంజ్ కి తెలుగు సినిమా చేయగలను. సో ఒకసారి అందులో నుండి బయటికి వచ్చేసి మిగతా బాషల్లో రిలీజ్ అంటే చాలా ఖర్చవుతుంది. అందుకే కేవలం తెలుగు మీదే ఫోకస్ పెట్టి సినిమా కంప్లీట్ చేశాం. తెలుగులో పెద్ద సక్సెస్ అయ్యాక రెండు వారాల్లో మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది. లెట్స్ ట్రై.

నా లిమిట్స్ నాకు తెలుసు 

ఈ కేరెక్టర్ చేసేటప్పుడు తాత గారి గెటప్స్ కానీ మేనరిజమ్స్ గానీ ఎలాంటివి రిఫరెన్స్ తీసుకోలేదు. ఆ ఆలోచనే లేదు. ఎందుకంటే ఆయన లెజెండ్. ఆయనకు సంబంధించి ఏదైనా రిఫరెన్స్ అంటే నేను దూరంగా వెళ్ళిపోతా. ఆయన్ని కొంచెం కూడా రీచ్ అవ్వలేం. నాకు నా లిమిట్స్ తెలుసు. అందుకే స్క్రిప్ట్ లో ఉన్నట్టుగా నాకు అనిపించనట్టుగా మాత్రమే నటించాను.

మార్పులు సహజమే 

ఏ కథకయినా మార్పులు సహజమే. ఎంత బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చినా కొన్ని మార్పులు చేయడం సహజమే. బింబిసార కథలో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ వచ్చాము. తారక్ కూడా తనకి అనిపించిన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు.

ఈ కథ నన్ను ఎంచుకుంది 

నిజానికి కొన్ని కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అది నేను నమ్ముతాను. అతనొక్కడే కథ చాలా మంది హీరోలు విన్నారు. కానీ నేను చేశాను. ఎందుకంటే ఆ కథ నాకు రాసుంది కాబట్టి. అలాగే బింబిసార కథ కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చిందని భావిస్తున్నాను. లేదంటే రాజుగా నేను ఒక సినిమా చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆ ఆలోచనే లేదు.

బాలయ్య గారితో సినిమా 

ఎన్టీఆర్ ఆర్ట్స్ లో బాలయ్య బాబాయ్ తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుండో ఉంది. ఆ మధ్య ఆయనకి ఓ కథ కూడా వినిపించడం జరిగింది. కానీ సెట్ అవ్వలేదు. కథ బాగుంటే ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు. త్వరలోనే బాబాయ్ తో ఒక సినిమా చేస్తాను.

సినిమా బాగుంటే కచ్చితంగా చూస్తారు 

థియేటర్స్ కి జనాలు రావడం లేదు. సినిమాలు చూడట్లేదు అంటే నేను నమ్మను. కంటెంట్ బాగుండి, మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే సినిమాలు కచ్చితంగా ఆడతాయి. మన తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమాలు చూసేందుకు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. వాళ్లకి నచ్చే సినిమా వస్తే తప్పకుండా థియేటర్స్ కి వచ్చి చూస్తారు. ఇటివలే మన తెలుగు సినిమా మేజర్ చూశారు కదా, అలాగే కమల్ గారి విక్రమ్ కూడా బాగానే ఆడింది. విక్రాంత్ రోన మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. థియేటర్స్ లో సినిమా చూడటం అనేది మన నేచర్ లో భాగమైన ఒక పని. మన సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ తో చూపిస్తే ఇదేదో బాగుండేలా ఉందే అని కచ్చితంగా వచ్చి చూస్తారు. అలాగే సినిమా బాగుంటే మౌత్ టాక్ కి పబ్లిసిటీ ఒక్కటి చాలు.

ఇండస్ట్రీ స్ట్రైక్ .. ఇంకా తెలుసుకోలేదు 

ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతుందని జస్ట్ ఒక ఇన్ఫో మాత్రమే నా దగ్గర ఉంది. కానీ పూర్తిగా దాని గురించి తెలుసుకోలేదు. ప్రస్తుతం ‘బింబిసార’ రిలీజ్ హడావుడిలో ఉన్నాను. రిలీజ్ తర్వాత ఒక హీరోగా నేను చేయబోయే సినిమాల నిర్మాతలతో మాట్లాడి విషయం తెలుసుకుంటాను. ఈ లోపు వాళ్ళను కూడా కలవాలనుకోవడం లేదు. ప్రెజెంట్ నా ఫోకస్ అంతా బింబిసార రిలీజ్ మీదే. మేము రెండేళ్ళు కష్టపడి తీసిన సినిమా ఇది.

బింబిసార 2 …కథ రెడీ 

ఈ సినిమాకు సంబంధించి ఇంకా సీక్వెల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి రెండో భాగానికి కథ రెడీ గా ఉంది. మొదలు పెట్టడమే ఆలస్యం. ఆగస్ట్ 5 తర్వాత పార్ట్ 2 డీటెయిల్స్ చెప్తాను.

NTR 30..అందుకే ఆలస్యం

తారక్ RRR తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. గ్లోబల్ యాక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒక బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత యాక్టర్ నుండి వచ్చే నెక్స్ట్ సినిమా అంటే కాస్త టైం తీసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే  డైరెక్టర్ గారి సైడ్ , ప్రొడక్షన్ సైడ్ అందరికీ ఒక ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ మీద చాలా ప్రెజర్ ఉంది. ఆడియన్స్ అంచనాలను మ్యాచ్ చేసే సినిమాతో రావాలని చూస్తున్నాం. టైం తీసుకోకుండా హరీ బరీ గా చేస్తే క్వాలిటీ ఫిలిం ఇవ్వలేం. అందుకే ఆలస్యం అవుతుంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics