బాలీవుడ్ టెంపర్ లో హీరో ఫిక్సయ్యాడు

Thursday,August 10,2017 - 07:06 by Z_CLU

N.T.R హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘టెంపర్’ సెన్సేషనల్ హిట్ అయింది. అయితే ఇప్పుడీ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. గతంలో ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసిన నిర్మాత సచిన్ జోషి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ప్రాసెస్ లో ఉన్నాడు.

రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రణవీర్ సింగ్ హీరోగా నటించానున్నాడనే న్యూస్ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం రణవీర్ సింగ్, సంజయ్ లీల భన్సాలి సినిమాతో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న రోహిత్ శెట్టి త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాడు. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ లో ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలి.