Allu Arjun Pushpa - ఇతడే విలన్?

Friday,November 13,2020 - 01:43 by Z_CLU

AlluArjun-Sukumar కాంబోలో మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కుతున్న Pushpa సినిమాలో విలన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంత వరకూ సినిమాలో బన్నీ కి అపోజిట్ ఎవరనేది చెప్పలేదు మేకర్స్. అయితే సుకుమార్ సినిమాలో విలన్ మరీ పవర్ ఫుల్ గా కనిపించరు. ఉన్నంతలో స్టైలిష్ గా కనిపిస్తారు. అయితే పుష్ప లో మాత్రం మాస్ ను ఎట్రాక్ట్ చేసేలా విలన్ క్యారెక్టర్ సృష్టించాడట సుక్కు.

ఆ రోల్ ను కోలీవుడ్ హీరో ఆర్య తో చేయించాలని చూస్తున్నారట. ఇటివలే Hero Arya ను సుక్కు అండ్ టీం సంప్రదించినట్లు సమాచారం.

allu arjun arya

‘వరుడు’ సినిమాలో బన్నీ కి విలన్ గా కనిపించాడు ఆర్య. మళ్ళీ ఇన్నేళ్ళకు ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో విలన్ గా తన లక్ చెక్ చేసుకోవాలని చూస్తున్నాడట. ఈ విషయంపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. Mythri Movie Makers నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం మారేడుమిల్లి పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.

also check – పుష్ప ఆన్-లొకేషన్ స్టిల్