Romantic ఆకాష్ పూరి ఇంటర్వ్యూ

Tuesday,October 26,2021 - 02:04 by Z_CLU

ఆకాష్ పూరి , కేతిక శర్మ జంటగా అనిల్ పాడూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రొమాంటిక్‘ సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మీడియాతో సినిమా గురించి మాట్లాడాడు. ఆ విశేషాలు ఆకాష్ మాటల్లోనే….

కథలోకే నేనొచ్చా

నాన్న ఈ కథ ఎప్పుడో రెడీ చేశారు. ‘మెహబూబా’ తర్వాత ఈ సినిమా చేస్తే బాగుంటుందని, యూత్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయని అనుకున్నాం. సో నా కోసం సిద్దమైన కథ కాదిది. కథలోకే నేనొచ్చాను.

రొమాన్స్ తగ్గించమని అడిగా 

డైలాగ్స్ చెప్పడం , ఫైట్స్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. కాస్త ఇబ్బంది పడేది మాత్రం రొమాన్స్ విషయంలోనే. ఈ సినిమా చేస్తున్నప్పుడు కావాలంటే గోడ మీద నుండి దూకుతూ ఇంకేదైనా చేస్తా కానీ రొమాన్స్ తగ్గించండి అని అడిగాను. దానికి నాన్న సినిమానే రొమాంటిక్ కదా ఆ మాత్రం ఉండాలి అన్నారు. సో రొమాన్స్ చేయడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది(నవ్వుతూ).

నాన్న డైలాగ్స్ కిక్ ఇచ్చాయ్

నాన్సిన డైలాగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నేనూ ఒకడ్ని. ఆ డైలాగ్స్ లో మంచి సౌండ్ ఉంటుంది.  ఆయన రాసిన  డైలాగ్స్ చెప్పేటప్పుడు నటుడిగా బాగా ఎంజాయ్ చేస్తాను.

అది నా అదృష్టం 

సినిమాలో రమ్య కృష్ణ గారు ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఆవిడ మా సినిమా ఒప్పుకోవడం, ఆవిడతో నటించడం నా అదృష్టం అనుకుంటున్నా. ఆవిడతో నాకు చాలా మంచి సీన్స్ ఉన్నాయి. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సార్లు మేడంతో నటించే టప్పుడు రజినీ కాంత్ గారి ముందు కూర్చొని గొప్పగా నటించిన రమ్య గారితో నేను కలిసి నటించడం ఏమిటి ? అనుకునే వాడ్ని. రమ్య గారు వచ్చాక సినిమా రేంజ్ పెరిగింది. సినిమాకు ఆవిడ క్యారెక్టర్ చాలా ప్లస్ అవుతుందని మేమందరం నమ్ముతున్నాం.

అదొక్కటే భయం 

మెహబూబా రిలీజయిన ఆరు నెలల తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ లో ఉండగానే ఈ సినిమా మొదలైంది. షూటింగ్ ఎండ్ కొచ్చేసరికి సరిగ్గా లాక్ డౌన్ వచ్చింది. సో ఆ టైంలో సినిమా OTT లో రిలీజ్ అయితే ? అనే భయం ఉంది. ఎందుకంటే ఇది థియేటర్ లో విజిల్స్ వేస్తూ చూసే సినిమా. లక్కీ గా థియేటర్స్ ఓపెన్ అవ్వడం మా వర్క్ కూడా టోటల్ ఫినిష్ అవ్వడంతో ఇప్పుడు వచ్చేస్తున్నాం. ప్రస్తుతం కరోన తర్వాత వచ్చిన చాలా సినిమాలు బాగానే ఆడాయి. మా రొమాంటిక్ కూడా ఆ  లిస్టు లో చేరుతుందని నమ్ముతున్నాను.

ఆ రోజు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను

ప్రభాస్ గారు మేము అడగకముందే ఆయనే సినిమాను ప్రమోట్ చేస్తాను అంటూ ముందుకొచ్చారు. హెక్టిక్ వర్క్ ఉన్న టైంలో కూడా ముంబై పిలిచి మరీ నాతో ఒక రోజంతా స్పెంట్ చేశారు. ఆ డే నేనెప్పటికీ మర్చిపోలేను. కొన్ని డైలాగ్స్ , సీన్స్ చూసి పది సినిమా ఎక్స్ పీరియన్స్ ఉన్న హీరోలా చేశావ్ అన్నారు. ఆ కాంప్లిమెంట్ కిక్ ఇచ్చింది.

romantic movie

ఆ కాన్ఫిడెన్స్ తోనే 

సినిమా మీద మా అందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఇండస్ట్రీ నుండి కొంత మంది సినిమా చూసి మెచ్చుకున్నారు. అందుకే రిలీజ్ కి ముందే ప్రీమియర్ షో ప్లాన్ చేశాం. రెండ్రోజుల ముందే సినిమా చూపించడానికి చాలా దైర్యం కావాలి. సినిమా మీదున్న నమ్మకంతోనే ముందడు వేస్తున్నాం.

స్పీచ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది 

నాన్న గురించి నా గురించి బయట చాలా మాటలు ఉన్నాను. నా కంటే నాన్న ని అన్నప్పుడే బాధేసింది. అందుకే ఈవెంట్ లో అలా మాట్లాడాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టండి నేను మాట్లాడాలి అన్నాను. ఏం మాట్లాడతావ్ రా అని నాన్న అడిగారు. పెట్టండి అక్కడే చెప్తా అనేశాను. అందుకే నాన్న కూడా స్పీచ్ విని సర్ప్రయిజ్ అయ్యారు. ఈవెంట్ అయ్యాక ఆయనకీ నా స్పీచ్ గురించి చాలా కాల్స్ వచ్చాయని అమ్మతో చెప్పారు.

akashpuri-chorbazaar-launched-zeecinemalu

‘చోర్ బజార్’ అలా ఉంటుంది

చోర్ బజార్ షూటింగ్  ఆల్మోస్ట్  ఎండింగ్ కొచ్చేసింది. అది పక్కా కమర్షియల్ సినిమా. మంచి యాక్షన్ తో డిజైన్ చేసిన స్క్రిప్ట్. చాలా పెద్దగా చేస్తున్నాం. రెండు మూడు నెలల్లోనే మళ్ళీ ఆ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తాను.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics