Ravi Teja 'టైగర్ నాగేశ్వరరావు' లాంచ్ డీటెయిల్స్

Thursday,March 31,2022 - 03:46 by Z_CLU

Here’s the Ravi Teja’s Pan Indian Film ‘Tiger Nageswara Rao’ launch details

మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి వంశీ దర్శకత్వం వహించనున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ సినిమాను సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

ఉగాది రోజున (ఏప్రిల్ 2న) మాదాపూర్ లోని నోవాటెల్ (హెచ్ఐసిసిలో) లో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను గ్రాండ్ లాంఛింగ్ చేయబోతున్నారు. భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ విడుదల చేయనున్నారు మేకర్స్.

టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ సినిమాగా తెరకెక్కనుంది. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్ట్ పురం నాగేశ్వరరావు కథతో ఈ సినిమా రూపొందనుంది.  అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో వంశీ ఈ సినిమాను తీయబోతున్నాడు. టైగర్ నాగేశ్వవర రావు గా  ఫుల్ పాత్రలో కనిపించేందుకు రవితేజ పూర్తిగా తన లుక్ మార్చబోతున్నాడు. సినిమాలో రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఈ సినిమా రూపొందుతోంది.

మది ISC కెమెరా బాధ్యతలు చేపట్టనున్నారు. GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.  ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరించనున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందిస్తున్నాడు.  మయాంక్ సింఘానియా సహ నిర్మాత.